సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్యారడైజ్ ఎఫెక్ట్.. ఆగిపోయిన చిరు- శ్రీకాంత్ ఓదెల సినిమా

ABN, Publish Date - Sep 26 , 2026 | 11:31 AM

దసరా వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోవడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

The Paradise

దసరా వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోవడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనే సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. చిరు ఓదెల సినిమాను మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించారు. చిరంజీవి ఇమేజ్‌కు తగినట్లుగా పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉండబోతోందని ప్రచారం జరిగింది. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. డానికి కారణం ఇటీవల నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ (The Paradise) చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నెగెటివ్ టాక్ తెచ్చుకోవడమే అని, ఆ ప్రభావం ఇప్పుడు మెగాస్టార్ ప్రాజెక్ట్‌పై గట్టిగా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


శ్రీకాంత్ ఓదెల టేకింగ్, కథనంలో మితిమీరిన రక్తపాతం, ఎమోషన్స్ పండకపోవడం వంటి కారణాలతో ది ప్యారడైజ్ ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో చిరంజీవి కాంబినేషన్ మూవీపై మెగా కాంపౌండ్ పునరాలోచనలో పడినట్లు టాలీవుడ్‌లో ప్రచారం ముమ్మరమైంది. మాస్ అండ్ వైలెన్స్ పేరుతో ప్రేక్షకుల మూడ్ దెబ్బతినే కథల కంటే, ఫ్యామిలీకి, మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే కథలకే చిరంజీవి ప్రస్తుతం మొగ్గు చూపుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టాలని లేదా పూర్తిగా రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం చిరంజీవి, కొల్లి బాబీ దర్శకత్వంలో కాకా సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల కథలో మార్పులు చేర్పులు కోరారా లేక ఈ కాంబినేషన్‌ను పక్కన పెట్టి వేరే దర్శకుడికి అవకాశం ఇస్తున్నారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అయితే ప్యారడైజ్ ఫలితం చూశాక ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లడం సేఫ్ కాదని మెగా టీమ్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.


సాధారణంగా సక్సెస్ ఉన్న దర్శకులతోనే సెట్స్ పైకి వెళ్లేందుకు మొగ్గు చూపే మెగాస్టార్, ప్యారడైజ్ షాక్ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమాను హోల్డ్‌లో పెట్టడం మంచిదే అని ఎంగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఈ నెగిటివిటీతో సినిమా మొదలుపెట్టినా.. అది అటుఇటు అయితే ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే చిరు అలాంటి ప్రమాదం రాకుండా ముందే జాగ్రత్త పడినట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, టాలీవుడ్ సర్కిల్స్‌లో మాత్రం ప్యారడైజ్ ఎఫెక్ట్ వల్లే ఈ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. మరి ఈ ప్రచారానికి శ్రీకాంత్ ఓదెల టీమ్ లేదా మెగా కాంపౌండ్ చెక్ పెడుతుందో లేదో చూడాలి.

Also Read:

బాస్ తొక్కేసాడా.. ఏమైనా కౌంటరా.. అదిరా మెగాస్టార్ అంటే

The Paradise: అక్కడ మెగాస్టార్ వెనుకే నాని!

Anjali: తొలి సినిమా దర్శకుడితో 20 ఏళ్ల తర్వాత మళ్లీ.

Updated Date - Sep 26 , 2026 | 11:31 AM