కంటెంట్‌ నమ్ముకుని 'మాయలేడి'తో బరిలోకి రాకేశ్‌ వర్రే!

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:58 PM

రాకేశ్‌ వర్రే హీరోగా నటిస్తూ నిర్మించిన ‘మాయలేడి’ నవంబర్‌ 13న విడుదల కానుంది. ప్రశంకర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మధుమిత సర్కార్‌ హీరోయిన్‌గా నటించారు. స్ట్రాంగ్‌ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిత్రబృందం తెలిపింది.

Maya Lady Movie

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే కొత్త చిత్రం 'మాయలేడి' ఈ నెల 13న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో ప్రశంకర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుమిత సర్కార్‌ హీరోయిన్‌గా నటించింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకులు శశికిరణ్‌ తిక్కా, పి. మహేశ్‌ బాబు ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాకేశ్‌ వర్రే మాట్లాడుతూ, 'ఎవరికి చెప్పొద్దు', 'పేకమేడలు' తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు 'మాయలేడి' స్క్రిప్ట్ విన్నాను. నేను ఈ సినిమా చేసేందుకు రెండు ప్రధాన కారణాల్లో ఒకటి స్క్రిప్ట్, రెండోది డైరెక్టర్‌గా ప్రశంకర్‌కు ఉన్న ప్యాషన్. మధుమిత హీరోయిన్‌గా, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మా టీమ్‌లో జాయిన్ అయ్యాక... ప్రాజెక్ట్ స్పీడప్ అయ్యింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా పనిచేశాం. కాస్టింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలని ప్రయత్నించాం. టెక్నీషియన్లను తీసుకోవవడంలో కూడా మా విజన్ ఉంది. అది స్క్రీన్ మీద మీరే చూస్తారు. మీ అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. మీ అందరికీ మా సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాం. ఈ నెల 13 రిలీజ్ టఫ్ డేట్ అని తెలుసు. చాలా సినిమాలు ఆ తేదీన వస్తున్నాయి. నాపై అభిమానంతో మా డిస్ట్రిబ్యూటర్స్ ఈ డేట్ ఎందుకు అని కూడా చెప్పారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే ఎన్ని సినిమాల మధ్యనైనా మా సినిమా ఆదరణ పొందుతుందని మేము నమ్మాం. ఆ కంటెంట్ నే నమ్ముకుని ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అయితే మరికొందరు కొత్త వాళ్లతో నేను సినిమాలు చేయగలుగుతాను' అని అన్నారు.


డైరెక్టర్ ప్రశంకర్ మాట్లాడుతూ, ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడితే కథలోని ట్విస్ట్స్ రివీల్ అవుతాయి. అందుకే ట్రైలర్ లో కూడా ఇంద్రజ గారు లాంటి ఆర్టిస్టులను రివీల్ చేయలేదు. సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ ను మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు. స్క్రీన్ మీదే వారి క్యారెక్టర్స్ ను ఎంజాయ్ చేయాలి. ఈ చిత్రానికి దాదాపు కొత్త టీమ్ పనిచేసినా ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేశారు. విశాల్ సాంగ్స్ కే కాదు సీన్స్ కు కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. చాలా సందర్భాల్లో సాంగ్ ఫైట్ కలిసి ఉంటాయి. డాన్స్, ఫైట్ మాస్టర్స్ కలిసి వాటిని కంపోజ్ చేశారు. రాకేష్ కెరీర్ లో 'ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు' వంటి డిఫరెంట్ మూవీస్ చేశారు. వాటికి కమర్షియల్ హంగులు జోడిస్తే ఎలా ఉంటుందో 'మాయలేడి' అలా ఉంటుంది. హీరోయిన్ మధుమిత క్యారెక్టర్ లో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. అవన్నీ స్క్రీన్ ఆకట్టుకుంటాయి. ఈ కథ విన్నప్పుడు హీరోయిన్ కు ఎడ్జ్ ఉండే స్క్రిప్ట్ ఇది అయినా నేను ఈ స్క్రిప్ట్ వదులుకోను అని రాకేష్ చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కథను నమ్మి ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నారు. మీరంతా మా సినిమాతో థియేటర్స్ లో ఒక కొత్త తరహా లవ్ స్టోరీ ఉన్న ఎంటర్ టైనర్ చూడబోతున్నారు' అని అన్నారు.


Maya Lady.jpg

హీరోయిన్ మధుమిత సర్కార్ మాట్లాడుతూ, 'ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాలోనే పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను చేసిన స్టంట్స్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మా మూవీ ప్రమోషనల్ కంటెంట్ కు మీరు మంచి రెస్పాన్స్ చూపించారు. ఆ రెస్పాన్స్ తో నాకు మీరు వెల్ కమ్ చెప్పినట్లు భావిస్తున్నాను' అని అన్నారు. ఈ కార్యక్రమంలో కో-ప్రొడ్యూసర్‌ విజిత్‌, రైటర్ బిందు, ఆర్ట్ డైరెక్టర్ భార్గవ్‌, నటి మధురిమ, లావణ్య, ఫైట్ మాస్టర్ అంజి, ఎడిటర్‌ రవితేజ గిరిజాల, డీఓపీ రాధాకృష్ణన్ ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి భామ.. వరుడు ఎవరంటే

రామాయణం ప్రభంజనం.. రికార్డులన్నీ బద్దలు

పవన్ కళ్యాణ్ విడాకులు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్

Updated Date - Nov 11 , 2026 | 03:03 PM