సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విడుదలైన 'మాయ లేడి' టీజర్!

ABN, Publish Date - Aug 04 , 2026 | 02:17 PM

యంగ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ రాకేశ్‌ వర్రే తాజా చిత్రం 'మాయ లేడి'. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రశంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.

Maya Lady Movie

యువ కథానాయకుడు, నిర్మాత రాకేశ్‌ వర్రే తాజా చిత్రం 'మాయ లేడి'. ఇందులో రాకేశ్‌ వర్రే హీరోగా నటిస్తూ, క్రేజీ యాంట్స్ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు. ఆయన గతంలో 'ఎవరికీ చెప్పొద్దు', 'పేకమేడలు' వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి, విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇప్పుడు 'మాయ లేడి'తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్‌గా నటిస్తోంది.


తాజాగా 'మాయ లేడి' సినిమా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరోయిన్ గురించి తెలుసుకున్న కొద్దీ ఆమె పట్ల హీరోలో మరింత ఆసక్తి పెరుగుతుంటుంది. ఆ అమ్మాయి గురించి తెలిసే కొద్దీ ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు. ఈ జంట లవ్ ప్రపోజ్ చేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో హీరోయిన్ గురించి కొత్త కొత్త విషయాలు తెసుకుంటాడు హీరో. 'తమ మధ్యకు ఎవరైనా వస్తే ఊరుకోనంటూ..' హీరోయిన్ యాక్షన్ తో సత్తా చూపిస్తుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కలిసి తమ శత్రువులతో ఫైట్ చేయడం గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది. గ్లింప్స్ చివరలో హీరో చెప్పిన 'ఇప్పుడు నా లవ్ స్టోరీలో విలన్ ఎవరో తెలుస్తోంది...' అనే డైలాగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ గ్లింప్స్ లో హీరో రాకేశ్‌ వర్రే ఫ్రెష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. లవ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన పర్ ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన 'నిన్ను చూసినాక ఈ క్షణం..' పాట గ్లింప్స్ ఫీల్ ను మరింత పెంచింది. మొత్తంగా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగే లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడబోతున్న ఫీల్ ను గ్లింప్స్ క్రియేట్ చేసింది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని తెలియచేస్తామని దర్శక నిర్మాత రాకేశ్ వర్రే తెలిపారు.

ఇవి కూడా చదవండి:

వరుస ఆఫర్లు.. మళ్లీ DSP ఫామ్‌లోకి వచ్చేసినట్టేనా?

తారక్ ‘డ్రాగన్’ షూటింగ్ ఆగిపోయిందా? అసలు విషయం ఏంటంటే

NBK112: అందుకు నో.. కొరటాల ప్లాన్ మారింది

Updated Date - Aug 04 , 2026 | 02:24 PM