Manchu Lakshmi: ప్రపంచ స్థాయి విద్యా విధానాలతో..విష్ ప్రీ స్కూల్
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:21 PM
ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి చిన్నారులతో సందడి చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో విష్ (వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్) ప్రీ-స్కూల్ ను ఆ మీ ప్రారంభించారు.
ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి (Manchu Lakshmi) చిన్నారులతో సందడి చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో విష్ (వెల్లింగ్టన్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్) ప్రీ-స్కూల్ ను ఆ మీ ప్రారంభించారు. ప్రపంచ స్థాయి విద్యా విధానాలను అనుసరిస్తూ చిన్నారుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఈ ప్రీ-స్కూల్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని లక్ష్మి చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి చిన్నారి తనలోని సహజ ప్రతిభను వెలికితీసుకునేలా ప్రోత్సాహకరమైన వాతావరణం అవసరం. పిల్లల్లో జిజ్ఞాస, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, దయ వంటి విలువలను పెంపొందించేలా విష్ రూపొందించిన విద్యా విధానం అభినందనీయం' అని ఏరుకొన్నారు.
విష్ వ్యవస్థాపకురాలు దీప్తి చిట్కారా మాట్లాడుతూ "ప్రతి చిన్నారి సహజంగానే జిజ్ఞాసతో, అపారమైన సామర్థ్యంతో ఉంటాడని మేము విశ్వసిస్తున్నాం. భద్రతతో కూడిన, ప్రేరణనిచ్చే, ఆనందభరితమైన వాతావరణంలో పిల్లలు తమ సామర్థ్యాన్ని గుర్తించి అభివృద్ధి చెందేలా చేయడమే మా లక్ష్యం. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, అనుభూతి, జీవితాంతం నేర్చుకునే ఆసక్తిని పెంపొందించడమే మా ధ్యేయం" అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
త్రిషకి ‘జననాయగన్’ నచ్చలేదా? అందుకే సైలెంట్‌గా...
‘జన నాయగన్’.. బాలయ్యని విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడా?
రాజమౌళికి దక్కింది.. మరి సందీప్ వంగాకి ఎప్పుడు?