‘మన డాక్టర్ బాబే’ సినిమాకు హీరో ఎవరంటే?
ABN, Publish Date - May 30 , 2026 | 10:17 PM
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ పై కృతాక్షి నిర్మిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతుండగా.. చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ పై కృతాక్షి నిర్మిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’ (Mana Doctor Baabe). ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతుండగా.. చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ని శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు విఎన్ ఆదిత్యతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. టీజర్ విడుదల అనంతరం విఎన్ ఆదిత్య (VN Aditya) మాట్లాడుతూ.. ‘మన డాక్టర్ బాబే’ టీజర్ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. ఇలాంటి మంచి కామెడీ సినిమాలు ఇండస్ట్రీకి అవసరం. టైటిల్‌లో ‘డాక్టర్, మన’ అనే పదాలు ఉంటే కచ్చితంగా సినిమాలు హిట్ అవుతుంటాయి. ఇలాంటి ప్రాజెక్టులకు తోడుగా నిలబడిన అలీ, రాజీవ్ కనకాలకు అభినందనలు. ఏవీఎస్ కుమార్తె శాంతి మళ్లీ కం బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నానని అన్నారు.
హీరో శ్రీ స్కంద (Sri Skanda) మాట్లాడుతూ.. ‘మన డాక్టర్ బాబే’ సినిమాను ప్రతీ ఒక్కరూ మన సినిమా అని అనుకుని ఎంతో సపోర్ట్ చేశారు, చేస్తున్నారు. దర్శకుడు చలపతి అన్నీ తానై ఈ సినిమా చేశారు. అన్ని బాధ్యతల్ని ఆయనే భుజానికెత్తుకున్నారు. ఇది చాలా మంచి కథ. ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌ను చాలా జాగ్రత్తగా తెరకెక్కించాం. టీజర్ చూసి కేవలం యూత్ సినిమా అని అనుకోవద్దు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. క్లైమాక్స్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఈవీవీ, జంధ్యాల వంటి దర్శకుల సినిమాలను చూసినట్టుగా ఉంటుంది. ఈ మూవీకి హీరో కథే. నేను కేవలం ఒక ఆర్టిస్ట్‌ని మాత్రమే. ఆల్రెడీ నేను సినిమా చూశాను.. ప్రతీ ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది. మంచి సినిమా చేశాననే ఫీలింగ్ నాకు కలిగింది. అందరూ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి, ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను.
దర్శకుడు చలపతి కుమార్ మాట్లాడుతూ.. దర్శకులు విఎన్ ఆదిత్యతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ప్రభు, సురేష్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తుంటారు. శ్రీ స్కంద వల్లే ఈ సినిమా మొదలైంది. ఆయనను చూసిన రోజే మంచి హీరో అవుతారని అనుకున్నాను. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆర్కే రైటర్ ఈ కథను చాలా బాగా డెవలప్ చేశారు. ప్రతీ సీన్‌కు ఆడియెన్స్ కచ్చితంగా నవ్వుతారు. ఇలాంటి కాన్సెప్ట్‌కి ఓ చిన్న లేయర్ ఉంటుంది.. దానిని ఎక్కడా మేము దాటలేదు. ఫక్తు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది. చివరకు థియేటర్ నుంచి కన్నీటి చెమ్మతో బయటకు వెళ్తారు. నా ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అలీ, రాజీవ్ కనకాల, ఇతర ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
రకుల్‌ని మోసం చేసిన అక్షయ్ కుమార్.. వీడియో చూశారా!
చీరకట్టులో ‘బిగ్‌బాస్’ బ్యూటీ శోభా శెట్టి.. సోషల్ మీడియా షేక్!
అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!