మావా అల్లుళ్ళు ఓకే... తండ్రీ కొడుకులకు పడిందిగా!?
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:30 AM
దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' మూవీ రిలీజ్ కాబోతున్న నవంబర్ 20వ తేదీన ధనుష్, మమ్ముట్టి సినిమా 'ఓం' జనం ముందుకు రాబోతోంది. సో... తండ్రీ కొడుకుల సినిమాలు రెండూ ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో వార్ కు సిద్ధమౌతున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajini Kanth) సినిమా 'జైలర్ 2' ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆ మర్నాడే అతని మాజీ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) సినిమా 'ఓం' విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా 'ఓం' (Om) సినిమాను నవంబర్ 20కి వాయిదా వేసినట్టు మేకర్స్ తెలిపారు. సో... ఈ మామా అల్లుళ్ళ బాక్సాఫీస్ వార్ కు శుభం కార్డు పడిపోయిన్టటే. కానీ చిత్రంగా ఇప్పుడు నవంబర్ 20కి ఈ సినిమా వాయిదా పడటంతో ఆ రోజున రావాల్సిన దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' మూవీకి కొత్త చిక్కొచ్చి పడింది.
దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ భారీగానే అభిమానులు ఉన్నారు. అతని డబ్బింగ్ సినిమాలతో పాటు స్ట్రయిట్ తెలుగు సినిమాలూ బాగా ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో దుల్కర్ లో ఇప్పటికే 'మహానటి, సీతారామం' చిత్రాలను నిర్మించిన స్వప్న సినిమాస్ సంస్థ గీతా ఆర్ట్స్తో కలిసి పవన్ సాదినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' సినిమా నిర్మిస్తోంది. దీనికి సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలు. అయితే ఇప్పుడీ సినిమా ధనుష్ 'ఓం'తో పోటీ పడాల్సి వస్తోంది. 'ఓం' సినిమాలో ధనుష్ హీరో అయినా... అందులో అత్యంత కీలకమైన పాత్రను దుల్కర్ తండ్రి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ పోషించారు. సో... తండ్రీ కొడుకుల సినిమాలు రెండూ ఒకే రోజున జనం ముందుకు రాబోతున్నాయి. మరి మమ్ముట్టీ అభిమానులు ఆయన సినిమా చూస్తారా? లేక కొడుకు దుల్కర్ సినిమా ముందు చూస్తారా? అనేది తెలియాలి!
ఇవి కూడా చదవండి:
సమంతకు కోర్టులో ఊరట.. ఆ వీడియోలు డిలీట్ చేయాల్సిందే
రణబాలి పాత్ర వెనుక ఉన్న అసలు వీరులు వీళ్లే..
RC17: చరణ్, సుక్కు మూవీ.. స్టార్ట్ కాకుండానే డెడ్‌లైన్!