సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మరో సాహసానికి సిద్దమైన పెద్ది.. కానీ, ఎందుకు

ABN, Publish Date - Jun 09 , 2026 | 07:51 PM

పెద్ది (Peddi) సినిమా కొత్త ప్రయోగం చేయబోతుందా అంటే.. నిజమే అనే టాక్ వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది.

peddi

పెద్ది (Peddi) సినిమా కొత్త ప్రయోగం చేయబోతుందా అంటే.. నిజమే అనే టాక్ వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్ది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ సీన్స్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ల్యాగ్ కూడా ఉందని, అవసరమైన సీన్స్ వదిలేసి, అనవసరమైన సీన్స్ ని యాడ్ చేసి రిలీజ్ చేయడంతో ఎమోషన్స్ కనెక్ట్ కాలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.


టాక్ పక్కనపెడితే.. కలక్షన్స్ లో మాత్రం పెద్ది దూసుకుపోతోంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరి రికార్డులు సృష్టించింది. అయితే ఈసారి పెద్ది మరో కొత్త ప్రయోగం చేయనుంది. ప్రేక్షకులను మెప్పించడానికి బుచ్చి కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. సెన్సార్ కి ముందు కట్ చేసిన కొన్ని సీన్స్ ను యాడ్ చేసి మరోసారి పెద్దిని కొత్తగా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. జాన్వీ పెళ్లి చూపులు సీన్, జగపతి బాబు - చరణ్ ఎమోషనల్ సీన్స్ ఇలాంటివి యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. అంతేకాకుండా సెన్సార్ అయిన వెర్షన్‌లో కొత్త సీన్స్ కలపడం లేదా తొలగించడం చేస్తే.. నియమ నిబంధనల ప్రకారం ఆ చిత్రాన్ని మళ్లీ సెన్సార్ బోర్డు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈ కొత్త వర్షన్‌ను రీ-సెన్సార్ కూడా చేయించాలని చూస్తున్నారట.


నిజంగా పెద్ది పెద్ద రిస్క్ నే చేస్తోంది. సాధారణంగా ఏ పెద్ద సినిమా అయినా టాక్ ని బట్టి ముందుకు సాగుతోంది. ఫస్ట్ రోజున చూసిన ప్రేక్షకుడి మదిలో నెగిటివ్ మార్క్ పడింది అంటే.. ఎన్ని మార్పులు చేసినా కూడా మళ్ళీ థియేటర్ కి రాడు. అంతేకాకుండా ఈలోపు మరో సినిమా రిలీజ్ అయితే థియేటర్లు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ వెర్షన్ నచ్చి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. మరి ఇవన్నీ ఆలోచించే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

మనిషివా.. దేవతవా.. సాయిపల్లవి నువ్వు

‘పెద్ది’ కట్ చేసిన సీన్స్ నాకు ఇచ్చేయండి..: బుచ్చిబాబుకు జగపతి డిమాండ్

మ్యాడ్ డైరెక్టర్ తో కార్తీ సినిమా ఆగిపోయిందా.. ?

Updated Date - Jun 09 , 2026 | 08:43 PM