మ్యాడ్ డైరెక్టర్ తో కార్తీ సినిమా ఆగిపోయిందా.. ?
ABN , Publish Date - Jun 09 , 2026 | 05:49 PM
మ్యాడ్ సినిమాతో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ 2.. మొదటి పార్ట్ అంత హిట్ కాకపోయినా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది.
మ్యాడ్ సినిమాతో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ 2.. మొదటి పార్ట్ అంత హిట్ కాకపోయినా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత శంకర్ .. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) తో ఒక సినిమాను మొదలుపెట్టాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడనున్నాడు. ఇక ఈ చిత్రంలో కార్తీ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించనుంది. ఈ మధ్యనే ఈ సినిమా పూజిజా కార్యక్రమాలను ముగించుకొని సెట్స్ మీదకు వెళ్ళింది.
అయితే గత రెండు రోజుల నుంచి కార్తీ- కళ్యాణ్ శంకర్ సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి షెడ్యూల్ పూర్తి కాకముందే కార్తీ.. ఇప్పటివరకు షూట్ చేసిన రషెస్ చూడాలని కోరాడట. అది చూసాక.. కొన్ని చేంజస్ చేయాలనీ, లేకపోతే వర్క్ అవుట్ అవ్వదని తెలిపాడట. పేపర్ మీద ఉన్న స్టోరీకి, టేకింగ్ కి చాలా తేడా ఉందని కార్తీ కనిపెట్టినట్లు సమాచారం. అలా ఈ ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని అంటున్నారు.
అంతేకాకుండా స్క్రిప్ట్ మార్పుల విషయంలో కూడా హీరోకి - డైరెక్టర్ కి అస్సలు సింక్ అవ్వడం లేదట. డైరెక్టర్ చెప్పింది కార్తీకి నచ్చకపోవడం.. ఆయన చెప్పినట్లు శంకర్ చేయను అనడంతో ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఆగిందంట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించినా.. ప్రకటించకపోయినా కూడా కార్తీ అయితే వేరే సినిమాపై దృష్టి పెట్టాలని చూస్తున్నాడట. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి:
మెగా హీరోస్ రేంజ్ అది.. మూడు వందల కోట్ల క్లబ్‌లో ఆ ముగ్గురు
Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్