సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: అసలైన బ్లాస్ట్‌ కోసం ఎదురుచూడండి

ABN, Publish Date - Nov 16 , 2026 | 07:57 PM

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ వరల్డ్‌ చిత్రం ‘వారణాసి’. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది.

 

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ వరల్డ్‌ చిత్రం ‘వారణాసి’. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వచ్చి ఏడాది పూర్తయింది. ‘వారణాసి’ టీజర్‌ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇవ్వాలంటూ ఓ అభిమాని ఎక్స్‌ వేదికగా చిత్రబృందాన్ని ప్రశ్నించారు. దీనికి మేకర్స్‌ స్పందించారు.

‘‘షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. సీజీఐ, రీరికార్డింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. డబ్బింగ్‌ పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇదే తాజా అప్‌డేట్‌గా భావించండి. లేదంటే అసలైన బ్లాస్ట్‌ కోసం ఎదురుచూడండి’’ అంటూ ఆసక్తికర సమాధానమిచ్చారు. దీంతో మహేశ్‌బాబు అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ చిత్రాన్ని  వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో మహేశ్‌బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కుంభగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 50 భాషల్లో డబ్బింగ్‌ చేసి, 120 దేశాల్లో విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  

ALSO READ:
Chiranjeevi: ఏఐ మోసాలకు చెక్ పెట్టాలి.. కేంద్రానికి చిరంజీవి విజ్ఞప్తి

Mysaa: ‘ఏనాటి వరమో నువ్వు’ సాంగ్ వచ్చేసింది

యువత ఆలోచనలకు అద్దం పట్టేలా.. ‘ఐ హేట్ మ్యారేజ్’ ట్రైలర్ రివ్యూ

Updated Date - Nov 16 , 2026 | 08:26 PM