సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వారణాసి.. ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందా?

ABN, Publish Date - Jun 05 , 2026 | 11:56 AM

గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపుదిద్దుకుంటున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌ వారణాసికి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న ప్యాన్ వరల్డ్ చిత్రం వారణాసి (Varanasi). గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులను సృష్టించ బోతుందనే దానిపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో పాటు మెయిన్ క్యాస్టింగ్‌ కెరీర్ రికార్డులను తిరగరాస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటం సినిమాకు అతిపెద్ద ఆకర్షణగా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఇండియన్ స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్‌లో ఈ మూవీపై భారీ క్రేజ్ ఏర్పడింది. మరోవైపు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకూమారన్ ఈ చిత్రంలో విలన్ రోల్‌లో నటిస్తుండటంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ స్థాయి భారీ వ్యయంతో రూపొందుతున్నందున, బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయి వసూళ్ల టార్గెట్‌తో మూవీ టీమ్ ప్రణాళికలు రచిస్తోంది.


ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే.. ఈ సినిమా మెయిన్ టీమ్ మెంబర్స్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల రికార్డులను 'వారణాసి' బ్రేక్ చేయగలదా అని. మహేష్ బాబు కెరీర్‌లో ఇప్పటివరకు రూ.220 కోట్లతో 'సరిలేరు నీకెవ్వరు' టాప్ గ్రాసర్‌గా ఉంది. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, గ్లోబల్ రిలీజ్ దృష్ట్యా మహేష్ పాత రికార్డును ఈ సినిమా చాలా సులువుగా అధిగమించే అవకాశం ఉంది. అలాగే, ప్రియాంక చోప్రా కెరీర్‌లో రూ.392 కోట్లతో 'క్రిష్ 3', పృథ్వీరాజ్ సుకూమారన్ కెరీర్‌లో రూ.612 కోట్లతో 'సలార్' చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించినవిగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఈ చిత్రానికి లభిస్తున్న హైప్ చూస్తుంటే వీరిద్దరి కెరీర్‌లలో కూడా 'వారణాసి' సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసలైన సవాల్ రాజమౌళి రికార్డు గురించే. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' చిత్రం రూ.1800 కోట్లతో ఇప్పటికీ ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతటి భారీ కలెక్షన్లను అధిగమించడం అంత సాదాసీదా విషయం కాదు. 'వారణాసి' ఆ రేంజ్‌ను దాటాలంటే ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, జక్కన్న మేకింగ్ స్టైల్, మహేష్ బాబు గ్లోబల్ లాంచ్, హాలీవుడ్ రేంజ్ ప్రమోషన్స్ తోడైతే 'వారణాసి' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం అసాధ్యమేమీ కాదు. విడుదల కాకముందే ఈ రేంజ్ చర్చకు తెరలేపిన ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చాక ఇంకెన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

వారణాసి.. ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందా?

Vijay: ‘జననాయకన్’ విడుదలపై సందిగ్ధత.. డిస్ట్రిబ్యూటర్ల డబ్బు వెనక్కి ఇచ్చేందుకు నిర్మాత సిద్ధం?

Rashmika Mandanna: ఆ పాత్రలో నటించేందుకు.. ముందు భయపడ్డా...

Updated Date - Jun 05 , 2026 | 01:28 PM