Mahendragiri Vaarahi: తప్పకనచ్చుతుంది... సుమంత్ హామీ!
ABN, Publish Date - Sep 12 , 2026 | 06:57 PM
'మహేంద్రగిరి వారాహి' సినిమాకు మౌత్ టాక్ బాగుందని, కలెక్షన్స్ నిదానంగా పికప్ అవుతున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఇప్పుడు 75 స్క్రీన్స్ ను అదనంగా పెంచామని నిర్మాత మధు తెలిపారు.
హీరో సుమంత్ నటించిన డివైన్ థ్రిల్లర్ మూవీ 'మహేంద్రగిరి వారాహి'. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించారు. లక్ష్మణ్, కలిపు మధు దీనిని ప్రొడ్యూస్ చేశారు. సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రానికి చక్కని స్పందన లభిస్తోందని చిత్ర బృందం తెలిపింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ, 'చాలా కాలంగా కొంతమంది ఇండస్ట్రీ పీపుల్, అలాగే నా ఫ్యాన్స్ నుంచి విషెస్ అందుకోలేదు. నిన్నటి నుంచి ఆ అభినందనలు మొదలయ్యాయి. ‘మహేంద్రగిరి వారాహి’ని గురించి ప్రేక్షకులు, అభిమానులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి చాలా మంచి కాల్స్ వస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్‌లో టాక్ చాలా పాజిటివ్‌గా ఉంది. పికప్ కావడానికి టైం పట్టింది, అది వాస్తవమే. ఇప్పుడు మంచి టాక్ సెటిల్ అయింది. ఈ టాక్ మరింత పెరుగుతుంది. చాలాకాలం తర్వాత నా స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి కంగ్రాచ్యులేషన్స్ అందుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మాకు సపోర్ట్ చేసిన మీడియాకి, ప్రేక్షకులకు థాంక్యూ. తప్పకుండా ఈ వీకెండ్ సినిమా చూడండి. మేము చాలా మంచి సినిమా చేశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అని అన్నారు.
డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ,'సినిమా చూసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుందో అనే ఒక చిన్న భయం ఉండేది. ఆడియన్స్ వాటిని చాలా ఎంజాయ్ చేశారు. ప్రతి షోకి ఫుట్‌ఫాల్స్ పెరుగుతున్నాయి. అలాగే షోస్ కూడా పెరుగుతున్నాయి. రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో మాది నంబర్ వన్‌లో ఉందని ఆడియన్స్ చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకుల పబ్లిక్ టాక్ రాపిడ్ ఫైర్‌లా వెళ్తుంది. ఇంకా అద్భుతంగా వెళ్లాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. నటుడు వంశీ చాగంటి మాట్లాడుతూ, 'సినిమా చూసిన అందరూ కూడా చాలా బాగుందని అంటున్నారు. ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్‌తో వెళ్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ట్రెండింగ్‌లో ఉంది. ప్రతి షోకి సేల్స్ పెరుగుతున్నాయి. మీరందరూ తప్పకుండా ఈ పండగ సెలవుల్లో సినిమా చూడండి. అందరికీ నచ్చుతుంది' అని చెప్పారు. నటి మీనాక్షి గోస్వామి మాట్లాడుతూ, 'మీ అందరికీ సినిమా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా సినిమా అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
నిర్మాత మధు మాట్లాడుతూ, 'ఇది మెల్లగా పికప్ అవుతుందని ముందే ఊహించాను. మేము ఊహించినట్టే ప్రతి షోకి సేల్స్ పెరుగుతున్నాయి. నిన్న రాత్రి కృష్ణా, ఈస్ట్, వైజాగ్, తిరుపతి, నైజాం అన్నిచోట్ల ఫుల్స్ వచ్చాయి. ఇప్పుడు 75 స్క్రీన్స్ పెంచాం. అలాగే ఒడిశాలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. హిందీలో కూడా మెల్లగా పికప్ అవుతుంది. చాలా మంచి సినిమా చేశాం. తప్పకుండా ఆడియన్స్ అందరూ థియేటర్స్‌కి వెళ్లి చూడండి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుంది' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
70 ఏళ్ల వయసొచ్చినా.. నచ్చితే రెండో పెళ్లి చేసుకుంటా: ప్రేమ
‘వారణాసి’ కీలక అప్‌డేట్.. ఇంత స్పీడ్ ఏంటి జక్కన్నా?
TFTDDA: జానీ మాస్టర్ వైఫ్ సుమలత స్కెచ్ అదిరిందిగా.. కోర్టు సంచలన తీర్పు