సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘మహాకాళి’ నుంచి ‘అయిగిరి నందిని’ సాంగ్ విడుదల.. పూనకాలే

ABN, Publish Date - Nov 05 , 2026 | 10:54 PM

‘హను-మాన్’ చిత్రంతో భారతీయ సినీ రంగాన్ని ఆశ్చర్యపరిచిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి రాబోతున్న మరో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహాకాళి’. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ని మేకర్స్ వదిలారు.

Mahakali Movie Still

‘హను-మాన్’ చిత్రంతో భారతీయ సినీ రంగాన్ని ఆశ్చర్యపరిచిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి రాబోతున్న మరో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహాకాళి’ (Mahakali). ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో ఆర్‌కేడీ (RKD) స్టూడియోస్ పతాకంపై రివాజ్ రమేష్ దుగ్గల్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు (Puja Aparna Kolluru) దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డి, రోహిత్ సారఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘అయిగిరి నందిని’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేసి, మ్యూజికల్ ప్రమోషన్స్‌ను దైవిక భావంతో కిక్‌స్టార్ట్ చేశారు.


జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన మహిషాసుర మర్దిని (అయిగిరి నందిని) స్తోత్రం (Aigiri Nandini) ఆధారంగా రూపొందించిన ఈ పాట ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పించేలా సాగింది. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి ఈ భక్తి గీతాన్ని ఆధ్యాత్మికత ఏమాత్రం చెడకుండా, భారీ ఆర్కెస్ట్రేషన్, అద్భుతమైన బీట్స్‌తో అత్యంత శక్తివంతంగా స్వరపరిచారు. గాయనీ గాయకులు అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్ తమ గంభీరమైన స్వరాలతో పాటకు ప్రాణం పోశారు. పాట మొదలైన క్షణం నుంచే క్రమక్రమంగా ఇంటెన్సిటీని పెంచుతూ, వినే ప్రతి ఒక్కరినీ భక్తి పారవశ్యంలో దాదాపు 8 నిమిషాల పాటు పూనకాలు తెప్పించారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.


సంగీతానికి ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ సైతం మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా మహాకాళి అమ్మవారి దివ్యరూపంలో నటి శ్రీయా రెడ్డి కనిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దుష్టశిక్షణ చేసే భయంకర ఉగ్రరూపంలో కనిపిస్తూనే.. మరోవైపు ఒక పసిబిడ్డకు చనుబాలు ఇచ్చే మాతృమూర్తిగా ఆమెను చూపించిన దృశ్యం అత్యంత భావోద్వేగభరితంగా, అద్భుతంగా ఆవిష్కృతమైంది. అపారమైన రౌద్రం, అనంతమైన వాత్సల్యం అనే అమ్మవారి రెండు విభిన్న కోణాలను దర్శకురాలు తెరపై చూపించిన విధానం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ విజువల్ వండర్‌కు సురేష్ రగుటు సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ అద్భుతమైన రిచ్‌నెస్‌ను తెచ్చిపెట్టాయి. మొదటి పాటతోనే సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిన ‘మహాకాళి’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2027 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

సాయి దుర్గ తేజ్ - కిరణ్‌ల నిశ్చితార్థం.. హాజరైన పలువురు సెలబ్రిటీలు

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు కాబోయే భార్య పేరు ఇదే..

చిరంజీవి ‘మెగావర్స్‌’లో సందడి చేయనున్న స్టార్స్‌ వీరేనా?

Updated Date - Nov 05 , 2026 | 10:54 PM