Sriya Reddy - OG: ఉన్నతంగా ఆలోచించగలిగినప్పుడే అద్భుతాలు జరుగుతాయి..

ABN , Publish Date - Sep 26 , 2025 | 02:17 PM

‘ఓజీ’ సినిమా సక్సెస్‌పై నటి శ్రియారెడ్డి స్పందించారు. ఇందులో ఆమె గీత పాత్రలో కనిపించి మెప్పించారు. సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రల్లో ఆమెది కూడా ఒకటి.


‘ఓజీ’ (OG) సినిమా సక్సెస్‌పై నటి శ్రియారెడ్డి (Sriya Reddy) స్పందించారు. ఇందులో ఆమె గీత పాత్రలో కనిపించి మెప్పించారు. సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రల్లో ఆమెది కూడా ఒకటి. తాజాగా ఎక్స్‌ వేదికగా ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమా విజయం దర్శకుడు చేసిన త్యాగాలకు నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ఆమె సుజీత్‌పై (Sujeeth) ప్రశంసల వర్షం కురిపించారు.
Sriya.jpeg

ఇంతకీ శ్రియారెడ్డి ఏమన్నారంటే.. ‘దర్శకుడు సుజీత్‌ థాట్స్‌ చాలా బావుంటాయి. ఆయన రాసిన పాత్ర తెరపై మరోసారి అద్భుతం సృష్టించింది. ‘ఓజీ’లాంటి సినిమాను అంగీకరించడానికి, అంత పెద్ద ప్రాజెక్ట్‌లో గుర్తింపు తెచ్చుకోవడానికి ఆత్మవిశ్వాసం ఉన్న దర్శకుడు అవసరం. సుజీత్‌ అలాంటి దర్శకుడే. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. ఉన్నతంగా ఆలోచించగలిగినప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో సుజీత్‌ ఒకరు. ఈ విజయానికి పూర్తి అర్హులు. మీరు. మీ కృషి, విశ్వాసం, మీరు చేసిన త్యాగాలు ఈ సక్సెస్‌కు నిదర్శనం’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.


 


ఓజీ కోసం హైదరాబాద్‌కు ప్రదీప్‌ రంగనాథన్‌
మరో పక్క నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ ఓజీ చిత్రం చూడటం కోసం హైదరాబాద్‌ వచ్చారు. సినిమా చూస్తున్న వీడియో షేర్‌ చేసి ‘నేను ఇప్పుడు హైదరాబాద్‌ రావడానికి ఒకే కారణం. పవర్‌స్టార్‌ నటించిన ఓజీ చూడటానికి మాత్రమే. ‘ఈ మాస్‌ ఎక్స్‌పీరియన్స్‌ని తెలుగు ఆడియన్స్‌తో కలిసి చూస్తేనే కదా అసలైన మాస్‌ ఆనందం’ అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఆయన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.
 

Updated Date - Sep 26 , 2025 | 02:29 PM