Mahakali: ప్రశాంత్ వర్మ.. మహాకాళి! అదిరిపోయే ఛాన్స్‌.. కొట్టేసిన‌ భూమి శెట్టి 

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:43 PM

ప్రశాంత్ వర్మ విభిన్న  సినిమాటిక్‌ యూనివర్స్‌ (పీవీసీయూ) నుంచి విభిన్న కథలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది ఓ సినిమాను ప్రకటించారు.

ప్రశాంత్ వర్మ (Prashanth Varma) పీవీసీయూ నుంచి విభిన్న కథలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది ఓ సినిమాను ప్రకటించారు. ప్రశాంత్ వర్మ.  పీవీసీయూ నుంచి వస్తున్న మూడో సినిమా ‘మహాకాళి’ (Mahakali). ఫీమేల్‌ సూపర్‌ హీరో చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రశాంత్‌ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి నటించనున్నట్లు తెలిపారు.  ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్‌ హీరోలు రానున్నారు’ అంటూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను పంచుకున్నారు. భూమి శెట్టి (Bhoomi Shetty) ‘కింగ్డమ్’ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే.


ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం  షూటింగ్‌  50 శాతం పూర్తయినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ సెట్ లో  చిత్రీకరణ జరుగుతోంది.  ఇందులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా (Akshaye Khanna) శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు.   ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) మాట్లాడుతూ.. ‘‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అని అన్నారు. ఈ సినిమా కాకుండా పీవీసీయూ ‘అధీర’ను ప్రకటించారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో  ఎస్‌జే సూర్య (S. J. Suryah), కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకుడు. 

Updated Date - Oct 30 , 2025 | 02:47 PM