‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ వీకెండ్ ఇరక్కొట్టేసిందిగా!
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:32 PM
సమంత ప్రధాన పాత్రలో, దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.
సమంత (Samantha) ప్రధాన పాత్రలో, దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి (BV Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రాజ్ నిడిమోరు (Raj Nidimoru) సృష్టించిన కథతో, ట్రాలాల మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే ప్రేక్షకుల నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, మహిళా ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో, ఈ చిత్రం మొదటి వీకెండ్‌లోనే బాక్సాఫీస్‌ను ఇరక్కొట్టేసింది.
రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 43 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ (Maa Inti Bangaaram 3 Days Collections) సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సినిమా పేరుకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద నిజంగానే ‘బంగారం’ లాంటి వసూళ్లను రాబడుతూ ‘బ్లాక్‌బస్టర్ బంగారం’గా దూసుకుపోతోంది. సంతోష్ నారాయణన్ అందించిన అద్భుతమైన సంగీతం, ఓం ప్రకాష్ విజువల్స్ ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి.
సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న చిత్రబృందం, తాజాగా ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో చిత్ర బృందంతో పాటు మహిళలు, ప్రేక్షకులు ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ సినిమా సృష్టించిన పాజిటివ్ వైబ్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ఈ వారం కూడా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో, ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్ల వేట లాంగ్ రన్‌లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సమంత బ్యానర్ ట్రాలాలా పిక్చర్స్‌లో వచ్చిన రెండో చిత్రమిది. ఇంతకు ముందు ఈ బ్యానర్‌లో ‘శుభమ్’ అనే చిత్రం వచ్చి మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇందులో సమంత కూడా ఓ గెస్ట్ పాత్రలో కనిపించారు.
ఇవి కూడా చదవండి:
ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక
మాట నిలబెట్టుకున్న థమన్.. ఎంత గొప్ప మనసో!
అందరి ముందు శ్రీలీలను అవమానించిన సీఎం భార్య..