‘M4M2’ అనౌన్స్‌మెంట్ ఇన్ M4M 60 డేస్ సెల్రబేషన్స్

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:15 PM

హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘M4M’ (మోటివ్ ఫర్ మర్డర్) బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

M4M 2 Movie Update

హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో తెరకెక్కిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘M4M’ (మోటివ్ ఫర్ మర్డర్) బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. జూలై 18న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉన్న ‘సినీ లాంజ్’లో ఈ వేడుక వైభవంగా జరిగింది. ఈ సంబరాల్లో చిత్ర దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla), హీరోయిన్ జో శర్మ (Jo Sharma)లతో పాటు సినిమా అభిమానులు, పలువురు ప్రముఖ కమ్యూనిటీ లీడర్లు, సినీ మేకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, ‘M4M’ సాధించిన విజయాన్ని బృందం ఘనంగా జరుపుకుంది. ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణే ఈ విజయానికి కారణమని, సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సాంకేతిక నిపుణులకు మోహన్ వడ్లపట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


ఈ సక్సెస్ మీట్ వేదిక పైనే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంచలనాత్మక ప్రకటన వెలువడింది. ఈ ఫ్రాంచైజీలో రాబోతున్న సీక్వెల్ ‘M4M-2’ ప్రాజెక్ట్‌ను మోహన్ వడ్లపట్ల, జో శర్మ అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగాన్ని మించేలా ఊహించని ట్విస్టులు, సస్పెన్స్, అద్భుతమైన విజువల్ గ్రాండియర్‌తో భారీ స్కేల్‌లో ఈ సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు వారు వెల్లడించారు. తొలి చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా తన నటనతో ఆకట్టుకున్న అమెరికన్ నటి జో శర్మ, ఈ సీక్వెల్‌లోనూ నటిస్తుండటం విశేషం. మొదటి భాగానికి లభించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, ‘M4M-2’లో మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.


M4M-Sequel.jpg

అమెరికాలో జరిగిన ఈ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ సినీ ప్రియుల్లో, ముఖ్యంగా థ్రిల్లర్ మూవీ లవర్స్‌లో ఉత్సాహాన్ని నింపిందనే చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ప్లే బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, జో శర్మ హీరోయిన్‌గా అలరించనున్నారు. రాహుల్ అడబాల కో-డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, వసంత్ ఇసైపెట్టై సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ భారీ సైకలాజికల్ థ్రిల్లర్ సీక్వెల్‌కు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.

ఇవి కూడా చదవండి:

ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు.. సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ వైరల్

మెగా ఫ్యామిలీ అని గర్వంగా చెప్పుకుంటున్నా: నిహారిక

చిరు, బాలయ్య చొరవతో ముగిసిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం

Updated Date - Jul 20 , 2026 | 03:29 PM