Lenin: బర్త్‌డే స్పెషల్.. భాగ్యశ్రీ భోర్సే ‘లెనిన్’ న్యూ పోస్టర్ వైరల్
ABN , Publish Date - May 06 , 2026 | 06:52 PM
మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ మూవీ నుంచి భాగ్యశ్రీ బోర్సే న్యూ లుక్‌ని మేకర్స్ వదిలారు.
మనం ఎంటర్‌ప్రైజెస్ LLP, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’ (Lenin). అఖిల్ అక్కినేని (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీని జూన్ 26న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నట్లుగా ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా హీరోహీరోయన్స్ ఇద్దరికీ ఎంతో కీలకమనే విషయం తెలియంది కాదు. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే పుట్టినరోజును (HBD Bhagyashri Borse) పురస్కరించుకుని మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ‘హ్యాపీ బర్త్ డే భాగ్య శ్రీ భోర్సే’ అని వచ్చిన పోస్టర్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. అందుకు కారణం పోస్టర్‌లో భాగ్యశ్రీ కనిపించిన తీరే అని చెప్పక తప్పదు. రెగ్యులర్‌గా కాకుండా ఈ లుక్ విషయంలో మేకర్స్ చాలా కొత్తగా ప్రయత్నించారు. రాజసం ఉట్టి పడేలా కిరీటీం, మీసం, డిఫరెంట్ వేషధారణతో భాగ్యశ్రీ లుక్‌ను రివీల్ చేశారు. ఇందులో భాగ్యశ్రీ ఆహార్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ లుక్ వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి? సినిమాలో ఈ పోస్టర్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? అనేది త్వరలోనే తెలియనుంది.
ఈ సినిమాతో కచ్చితంగా అటు అఖిల్‌కు, ఇటు భాగ్యశ్రీకి హిట్ వస్తుందని అంతా భావిస్తున్నారు. అక్కినేని అభిమానులైతే ఈ సినిమాపై ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు. మరి వారి నమ్మకం నిజమవుతుందో, లేదో తెలియాలంటే మాత్రం జూన్ 26 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను
Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!
‘సన్ రైజర్స్’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?
Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!