Bhagyashri Borse: ఆ కళ్లేంట్రా బాబు.. చూపుతోనే చంపేలా ఉంది! కింగ్డమ్ ‘ప్రిన్సెస్’ కాంత బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్
ABN , Publish Date - May 06 , 2025 | 05:14 PM
మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse). ఆ సినిమా భారీ డిజాస్టర్ అయినా అమ్మడు మాత్రం ఓవర్‌నైట్ స్టార్ అయింది.
గత సంవత్సరం రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది మరాఠి బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse). ఆ సినిమా భారీ డిజాస్టర్ అయినా అమ్మడు మాత్రం ఓవర్‌నైట్ స్టార్ అయింది. దాంతో ఒక్కసారిగా అవకాశాలు వెళ్లువలా తలుపుతట్టి ముద్దుగుమ్మకు క్షణం తీరిక లేకుండా కెరీర్ బిజీగా మారింది. ఇప్పటి వరకు చేసింది ఒక్క సినిమానే అయినా కుర్రకారు కలలరాణిగా అవతరించింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో చేసిన కింగ్డమ్ (Kingdom) చిత్రం విడుదలకు రెడీ అవగా, రామ్ (#RAPO22), దుల్కర్ సల్మాన్ కాంత (Kaantha) సినిమాలతో బిజీగా ఉంది. మరో రెండు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి కూడా. అయితే మంగళవారం మే6న భాగ్య శ్రీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయా చిత్రాల మేకర్స్ భాగ్యశ్రీ (Bhagyashri Borse) ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫొటోలు చూసిన వారంతా అందానికే వన్నె తెచ్చేలా.. అందానికే అసూయ వచ్చేలా భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) ఉందంటూ కామెంట్లు చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భవిష్యత్తులో మంచి మంచి సినిమాలతో కలకాలం ఆడియన్స్‌ను అలరించాలని కోరుకుంటున్నారు. మీరూ ఈ నయా టాలీవుడ్ సన్షేషన్ చిత్రాలపై ఓ లుక్కేయండి. శుభాకాంక్షలు తెలపండి.