సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను

ABN, Publish Date - May 06 , 2026 | 05:23 PM

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని స‌త్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.

Lavanya Tripathi about Sathi Leelavathi

ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ నిర్మాణంలో లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela), దేవ్ మోహన్ (Dev Mohan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ (శివ మ‌న‌సులో శృతి)’ ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 8న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాకు సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..


‘‘నాకు ‘సతీ లీలావతి’ మూవీపై ఎంతో నమ్మకం ఉంది. సినిమాను నేను ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది. ఇక ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలని వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీ షూటింగ్ టైంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కానీ టీం ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా షూటింగ్ అంతా సాఫీగా చేశాను. ప్రతీ రోజూ షూటింగ్ అయిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేసుకుంటూ ఉండేదాన్ని. చిత్రీకరణలో చిన్న చిన్న గాయాలవడం కామన్. మొదట ఈ కథ విన్నప్పుడు వరుణ్‌కి చెప్పాను. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలీదు, అలాంటి సింప్టమ్స్ కూడా లేవు. షూటింగ్ కూడా అంత ఈజీ కాదని అర్థమైంది. ఈ మూవీ కోసం వెయిట్ కూడా తగ్గాను. కానీ నాకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, రెస్ట్ తీసుకుంటాను.


ఈ చిత్రంలో నేను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తాను. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ అద్భుతంగా కుదిరింది. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను, నా మేనేజర్ సినిమా చూస్తూ ఫుల్లుగా నవ్వుకున్నాం. కొన్ని చోట్ల చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇందులో మంచి మెసేజ్ ఉంది. అలా అని.. ఏదో బోధిస్తున్నట్టుగా, క్లాస్ ఇస్తున్నట్లుగా అనిపించదు. నేను ప్రెగ్నెంట్ కదా? అని స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్‌లో చిన్న మార్పులు చేశారు. నేను ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ చేశాను. కాలితో కొట్టే సీన్ ఒకటి చేశాను. అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించింది. ఇందులో చూపించినట్టుగా రిలేషన్స్ బయటి ప్రపంచంలో ఉండవు. అలాంటి పరిస్థితి కూడా ఏ మహిళకీ రాకూడదు. నాకు రియల్‌ లైఫ్‌లో వరుణ్ వంటి మంచి భర్త దొరికారు. ప్రస్తుతం నేను నా భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నాను..’’ అని లావణ్య చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!

‘సన్ రైజర్స్‌’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!

‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?

Updated Date - May 06 , 2026 | 05:23 PM