ఇరుముడి సెంటిమెంట్ ఫాలో అవుతున్న కిరణ్ అబ్బవరం..
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:01 PM
ఈమధ్య కాలంలో పాత పాటల రీమిక్స్‌లు, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఫోక్/డివోషనల్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ అందుకుంటున్నాయి.
ఈమధ్య కాలంలో పాత పాటల రీమిక్స్‌లు, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఫోక్/డివోషనల్ సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రేంజ్‌లో రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఆడియన్స్ ఆలోచనలకు, ఆసక్తికి తగ్గట్లుగానే మన ఫిలిం మేకర్స్ కూడా మంచి మంచి వైరల్ పాటలను, జానపద గేయాలను వెతికి మరీ తమ సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఇరుముడి చిత్రంలో మల్లెపూల పల్లకి పాట ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను, ట్రెండ్‌ను ఫాలో అవుతూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒక క్రేజీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. .
కిరణ్ అబ్బవరం తన సొంత దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రియాలిటీ. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్తా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఒక విపరీతమైన క్రేజ్ ఉన్న డివోషనల్ కమ్ ఫోక్ సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్ చేయబోతున్నారట.గతంలో కిరణ్ అబ్బవరం నటించిన K-Ramp సినిమాలో ఇదేమిటమ్మా మాయ పాటను వాడి ఏ స్థాయిలో ట్రెండింగ్ తెచ్చాడో అందరికీ తెల్సిందే. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపు ప్రతీ ఒక్కరి రీల్స్‌లో మారుమోగిపోయిన రఘుకుల తిలక రారా అనే వైరల్ పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేయబోతున్నాడట. ఇప్పటికే ఆ సాంగ్ హక్కులను ఆయన ఇప్పటికే సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జానపద కళాకారులు పాడిన ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందింది.
ఇక ఈ వైరల్ పాటను 'రియాలిటీ' సినిమాలో సన్నివేశానికి తగ్గట్లుగా, మరింత గ్రాండ్‌గా వాడుకోబోతున్నారని టాక్. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ ఈ ఒరిజినల్ ట్యూన్‌కు సరికొత్త ఆర్కెస్ట్రేషన్‌తో ఆధునిక మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట. ఇరుముడిలో మల్లెపూల పల్లకి రిలీజ్ అయ్యినప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. అవన్నీ లేకుండా జాగ్రత్తగా ఈ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు రఘుకుల తిలక రారా పాట కూడా సరిగ్గా సెట్ అయితే రియాలిటీ సినిమాకు అది తిరుగులేని ప్లస్ పాయింట్ కావడం ఖాయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి:
ట్రోలర్లకు వార్నింగ్.. బిగ్‌బాస్‌లో షర్ట్ విప్పి సల్మాన్ రచ్చ
ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే.. అందుకు కారణం విజయ్ అన్నే: అట్లీ
ఐదు కాదు.. టాలీవుడ్ సినిమాకు మరో మూడు కావాలి