‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ వదిలిన చిరు.. ఏమన్నారంటే
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:46 AM
కొత్త తరహా సినిమాలను అభినందిస్తూ.. వాటికి తన వంతు సపోర్ట్ అందించే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరోసారి ఓ న్యూ కాన్సెప్ట్ కంటెంట్‌కు అండగా నిలిచారు. అదే ‘అబ్జెక్షన్ మై లార్డ్’. ఈ ఒరిజినల్ ట్రైలర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
కొత్త తరహా సినిమాలను అభినందిస్తూ.. వాటికి తన వంతు సపోర్ట్ అందించే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరోసారి ఓ న్యూ కాన్సెప్ట్ కంటెంట్‌కు అండగా నిలిచారు. అదే ‘అబ్జెక్షన్ మై లార్డ్’ (Objection My Lord). ఈ ఒరిజినల్ ట్రైలర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విడుదల చేశారు. శ్రీకాంత్ మేకా (Srikanth Meka) ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఛానెల్ జీ5లో జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వైవిధ్యమైన సినిమాలు, సిరీస్, షోస్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న జీ5 (Zee5) తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ అనే కోర్ట్ డ్రామాతో మెప్పించటానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా మేకర్స్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ అనే ఒరిజినల్ ట్రైలర్‌ను బుధవారం మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
ట్రైలర్ విడుదల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ ట్రైలర్ చూస్తుంటే గతంలో తమ్ముడు కళ్యాణ్ చేసిన ‘వకీల్ సాబ్’ సినిమా గుర్తుకు వస్తోంది. అలాగే ఇంకా వెనక్కి వెళితే నేను నటించిన నా చిత్రం ‘న్యాయం కావాలి’ గుర్తుకు వచ్చింది. ఎప్పుడైనా కోర్ట్ డ్రామాలను డైరెక్టర్ సంతోష్‌లాగా తీయగలిగితే తప్పకుండా విజయాన్ని అందుకుంటాయనడంలో సందేహం లేదు. హిందీ, తెలుగు, తమిళ ఇలా ఏ భాషలోనైనా ఇలాంటి సినిమాలు హిట్ అవుతుంటాయి. జీ5కి ఈ 7 ఎపిసోడ్స్ సిరీస్ హిట్ అవుతుందని, వారికి మంచి వ్యూయర్ షిప్‌ను తీసుకువస్తుందని నమ్ముతున్నాను. టెక్నీషియన్స్ పరంగా చూస్తే.. దర్శకుడు సంతోష్ ఇంతకు ముందు ‘అర్జున్ సురవరం’ సినిమాను రూపొందించారు. ఈ సిరీస్‌ను నా మిత్రుడు, అనుంగుడు, ఎప్పుడూ నా పక్కనే ఉండే వ్యక్తి, ఇంకా చెప్పాలంటే నా దళపతి, తమ్ముడులాంటి రాజ్ కుమార్ ఆకెళ్ల నిర్మించాడు. నా తమ్ముడు శ్రీకాంత్ ఎప్పటికప్పుడు తనని తాను అప్‌డేట్ చేసుకుంటూ ఉంటాడు. పంథాను మార్చుకుంటూ.. మంచి పెర్ఫామెన్స్‌కు అవకాశం ఉందంటే విలన్‌గా కూడా చేయటానికి ఆలోచించడు. ఎల్లలు లేకుండా తనని తాను ఎక్స్‌పెండ్ చేసుకుంటున్నాడు. తనొక వండర్‌ఫుల్ పెర్ఫామర్. ఈ ట్రైలర్‌ను గమనిస్తే తన పాత్ర పరంగా పడే బాధ, ఎమోషన్‌ను అద్భుతంగా పలికించాడు. 19 రోజుల్లోనే ఈ 3 గంటల సిరీస్‌ను చేయటం అనేది గొప్ప విషయం. అనన్య, స్నేహల్ కూడా బెస్ట్ ఇచ్చి ఉంటారనుకుంటున్నాను. అలాగే నా తమ్ముడు సమీర్.. తను కూడా మంచి రోల్ చేశాడు. ముఖేష్ రుషి చాలా మంచి పాత్రలో కనిపించారు. రాజ్‌కుమార్, సంతోష్ చక్కగా ఫ్రేమ్ చేసుకుని మంచి ఒరిజినల్ చేశారు. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ అనే సిరీస్ జీ5లో జూలై 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అందరూ తప్పకుండా చూడండని అన్నారు.

ఇక ట్రైలర్ (Objection My Lord Trailer) విషయానికి వస్తే.. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ఓ కోర్ట్ రూమ్ డ్రామా. నారాయణ అనే వ్యక్తి తన కూతురు కనిపించటం లేదంటూ పోలీస్ స్టేషన్‌కు వెళతాడు. పోలీస్‌లు పట్టించుకోకపోవడంతో.. కోర్టుకు వస్తాడు. కానీ అక్కడ కూడా న్యాయం జరగదు. దాంతో తను కోర్ట్ ప్రాంగణంలోనే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ కేసుని ఎవరూ డీల్ చేయరు. అలాంటి సమయంలో ఆ కోర్టులో ఫెయిల్యూర్ లాయర్ అని అందరితో పిలిపించుకునే పరశురాం (శ్రీకాంత్) రంగంలోకి దిగుతాడు. నారాయణకు న్యాయం చేయటానికి కోర్టులోకి అడుగు పెడతాడు. అయితే తనకు ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని పరశురాం ఎలా ఎదుర్కొన్నాడు? అసలు అందరూ అతన్ని ఫెయిల్యూర్ లాయర్ అని ఎందుకు అంటుంటారు? అతనికున్న సమస్య ఏంటి? నారాయణకు న్యాయం జరుగుతుందా? అనే ఆసక్తి కథాంశంతో 7 ఏపిసోడ్స్‌గా ఈ సిరీస్ జీ5లోకి రానుంది. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ ఒరిజినల్‌ను రూపొందించారు. ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ఒరిజినల్‌కు అరుణ్ చిలువేరు సంగీతం అందించగా.. సూర్య సినిమాటోగ్రఫీ అందించారు.
ఇవి కూడా చదవండి:
నేను పొందిన పిత్రోత్సాహం.. వారు కూడా పొందాలి కదా: చిరంజీవి
ఏడు నెలల పోరాటం తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ‘జననాయగన్’ ఫీవర్
రామ్ చరణ్ నటన అంటే చాలా ఇష్టం: జయకృష్ణ ఘట్టమనేని