‘King100’ గ్లింప్స్.. భలే ట్విస్ట్ ఇచ్చారుగా
ABN, Publish Date - Aug 29 , 2026 | 11:41 AM
టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై గత కొంతకాలంగా అనేక రకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడందరికీ ట్విస్ట్ ఇస్తూ.. ఈ మూవీ టైటిల్‌ని అనౌన్స్ చేశారు.
టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంపై గత కొంతకాలంగా అనేక రకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే, వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ మేకర్స్ ‘కింగ్ 100’ (#KING100) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో అందరికీ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. నేడు (ఆగస్ట్ 29) నాగార్జున పుట్టినరోజును (HBD King Nagarjuna) పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నాగార్జున సతీమణి అమల అక్కినేని (Amala Akkineni) సోషల్ మీడియా వేదికగా ఈ గ్లింప్స్‌ను విడుదల చేస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె తన పోస్ట్‌లో.. ‘‘99 సినిమాలు పూర్తయినా సినిమాపై ఆయనకున్న ప్యాషన్ ఇప్పటికీ అలాగే ఉంది. ఆయన సినీ ప్రయాణాన్ని దగ్గరుండి చూడటం, విజయాలను వేడుక చేసుకోవడం, అన్ని సమయాల్లోనూ ఆయనకు తోడుగా నిలవడం నా అదృష్టం. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ 100వ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. లవ్ యు ఫరెవర్ నాగ్!’’ అంటూ ఎంతో ప్రేమగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ‘కింగ్100’ (King100) గ్లింప్స్ విషయానికి వస్తే.. ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్, అదిరిపోయే ఎలివేషన్లతో హై-వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లో రూపొందించారు. ‘‘మనుషుల్లో రెండు రకాలు.. డబ్బున్నోళ్లు, డబ్బు లేనోళ్లు.. డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు.. డబ్బున్నప్పుడు దే కాల్ మీ ది కింగ్’’.. అంటూ నాగార్జున తన మార్క్ బేస్ వాయిస్‌తో చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ టీజర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘‘దిస్ ఐడెంటిటీ ఈజ్ మోర్ పవర్‌ఫుల్ దేన్ మనీ.. ఆ ఐడెంటిటీ నిలబెట్టుకోవడం కోసం నేను పరిగెడుతూనే ఉన్నా’’ అంటూ.. ఒక చేత్తో చిన్నారిని ఎత్తుకుని మంటల నడుమ నిలబడిన నాగార్జున లుక్, మరోవైపు స్టైలిష్ వింటేజ్ కార్ ఎంట్రీ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. నాగార్జున స్వాగ్, గ్రేస్, వింటేజ్ లుక్స్ ఈ గ్లింప్స్‌లో నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని కుటుంబం నిర్మిస్తోన్న ఈ భారీ మైలురాయి చిత్రానికి రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రాజా మహదేవన్ రిచ్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతి ఫ్రేమ్‌ను గ్రాండ్‌గా ఎలివేట్ చేశాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి టబు కీలక పాత్ర పోషిస్తుండగా.. గ్లింప్స్ చివర్లో చిత్రాన్ని 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తంగా చూస్తే.. నాగార్జున 100వ సినిమా నుంచి వచ్చిన ఈ ఫస్ట్ గ్లింప్స్ అంచనాలను ఒక్కసారిగా పెంచేసిందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.
ఇవి కూడా చదవండి:
Nayantara: మనిషి మారినా దక్కని విజయం!
హీరోయిన్లు కాదు.. విలన్లు! నెగెటివ్ పాత్రలతో మెప్పిస్తున్న భామలు
Raviteja: ‘ఇరుముడి’ తర్వాత రవితేజ స్పీడ్.. ఐశ్వర్య రాజేశ్‌తో కొత్త ప్రయోగం!