సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nagarjuna - DSP: హ్యాట్రిక్‌ ఇచ్చిన డిసెంబర్ మాసం...

ABN, Publish Date - Sep 08 , 2026 | 11:15 AM

కింగ్‌ నాగార్జున - దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో డిసెంబర్ మాసంలో ఇంతవరకూ మూడు చిత్రాలు విడులైతే... మూడూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు నాగ్ వందో సినిమా 'కింగ్‌ 100' కూడా అదే నెలలో వస్తుండటంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

DSP - Nag

కింగ్‌ నాగార్జున సినిమాలు చాలా వరకూ మ్యూజికల్‌ హిట్సే! కొన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించకపోయినా... సంగీత పరంగా శ్రోతలను ఆకట్టుకున్న సందర్భాలూ అనేకం ఉన్నాయి. విశేషం ఏమంటే నాగార్జున, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ లది హిట్‌ కాంబినేషన్‌. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుల చిత్రాలకూ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చి, వాటిని విజయపథంలోకి తీసుకెళ్ళాడు. అందువల్లే అక్కినేని అభిమానులకు దేవిశ్రీ ప్రసాద్‌ అంటే ప్రత్యేకాభిమానం. అందువల్లే అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో మైలు రాయి లాంటి వందో సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ నే సంగీతం దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గత నెలలో వచ్చినప్పుడు ఫ్యాన్స్ అంతా హర్షం వెలిబుచ్చారు.


'కింగ్‌ 100' సినిమా డిసెంబర్‌ 24న విడుదల కాబోతోంది. నాగార్జున కెరీర్‌లో ఈ తేదీన ఇంతవరకూ ఒకే ఒక్క సినిమా విడుదలైంది. అదే 'రగడ'. 2010 డిసెంబర్ 24న ఈ సినిమా జనం ముందుకొచ్చింది. అంటే 16 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 24న నాగార్జున మరో సినిమా అదే తేదీన రాబోతోందన్న మాట. ఇదిలా ఉంటే... నాగార్జున - డీఎస్పీ కాంబోలో చాలానే సినిమాలు వచ్చినా, డిసెంబర్‌లో వచ్చిన 'మన్మథుడు, మాస్, కింగ్‌' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు అదే నెలలో 'కింగ్‌ 100' కూడా వస్తుండటంతో ఆ సెంటిమెంట్‌ మరోసారి వర్కౌట్‌ అవుతుందనే ధీమాతో అక్కినేని అభిమానులు ఉన్నారు. మరి వారు కోరుకున్న విజయం ఈసారి కూడా లభిస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి:

కోట్ల ఆస్తి.. చీరలు అమ్ముతున్న నాగార్జున భార్య.. ఎంతకు దిగజారారురా

Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ గురుకుల విద్యార్థుల సందడి..

Priyanka Chopra: బిగ్‌బాస్‌ 20లో మేరీకోమ్ ఎంట్రీ.. కంటెస్టెంట్లకు ప్రియాంక చోప్రా సరదా వార్నింగ్!

Updated Date - Sep 08 , 2026 | 11:22 AM