Kavya Kalyanram: 'బలగం' భామ భలే వుంది, మీరూ చూసెయ్యండి !

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:12 PM

'గంగోత్రి' సినిమాతో బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, చాలా సినిమాలు బాలనటిగా చేసి, తరువాత న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై, కథానాయకురాలిగా 'మాసూద' సినిమాతో మళ్ళీ ఆరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్, ఇప్పుడు ఒక సంగీతపరమైన వీడియో పాటలో నటించింది.

Kavya Kalyanram: 'బలగం' భామ భలే వుంది, మీరూ చూసెయ్యండి !
Kavya Kalyanram

'గంగోత్రి' సినిమాతో బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అనే పాటలో ఆమె నటనకి మంచి ప్రశంసలు వచ్చాయి. బాలనటిగా చాలా చిత్రాలలో నటించిన కావ్య న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలయింది.

Kavyakalyanram.jpg

'మాసూద' అనే ఒక హర్రర్ సినిమాతో 2022 లో కథానాయకురాలిగా ఆరంగేట్రం చేసింది. తన మొదటి సినిమాతో మంచి ప్రతిభ గల నటి అని నిరూపించుకుంది. రెండో సినిమా 'బలగం', ఇందులో ఆమె ప్రియదర్శి పక్కన కథానాయికగా చేసింది. ఈ సినిమా నేపధ్యం తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో జరిగిన కథ.

Kavyakalyanram5.jpg

ఈ సినిమాలో పాటలన్నీ పెద్ద హిట్, అందులో కావ్యపై తీసిన ఈ 'పొట్టి పిల్లా పొట్టి పిల్లా' పాట అయితే ఇంకా పెద్ద హిట్. ఇప్పటికీ యూట్యూబ్ లో ఈ వీడియో పాటకి 15 మిలియాన్ వ్యూస్ వచ్చాయి అంటే ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనవసరం లేదు. 'బలగం' కావ్య కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

Kavyakalyanram2.jpg

తరువాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహ కథానాయకుడిగా వచ్చిన 'ఉస్తాద్' లో కథానాయికగా నటించింది. మొదటి రెండు సినిమాలు వ్యాపారాత్మకంగా విజయం సాధిస్తే ఈ మూడో సినిమా 'ఉస్తాద్' అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. కానీ ఇందులో కావ్య కళ్యాణ్ రామ్ చేసిన నటనకి విమర్శకులనుండి మంచి ప్రశంసలు వచ్చాయి.

kavyamusicalbum.jpg

కావ్య ఇప్పుడు ఒక 'ఓ సెలియా' అనే ఒక సంగీతపరంగా వీడియో చేసింది. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో బాగానే పోతోంది. కావ్య నాట్యంలో శిక్షణ తీసుకుంది, అందుకు ఈ వీడియో పాటలో ఆమె తన నృత్య ప్రదర్శనని కూడా అందంగా ప్రదర్శించింది. ఇది ఒక ప్రేమ పాట, ఇందులో కావ్య చాలా అందంగా కనిపించడమే కాకుండా, ఎంతో సహజంగా ఉన్నట్టు కనిపిస్తుంది.

Kavyakalyanram8.jpg

ప్రస్తుతానికి కావ్య కొత్త సినిమాలు ఏవీ వొప్పుకున్నట్టుగా కనిపించలేదు. ఆమె సామాజిక మాధ్యమంలో తన తాజా ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ వున్నారు.

Updated Date - Apr 23 , 2024 | 05:12 PM