సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తండ్రీ కొడుకుల కథతో 'కరుణామయ'

ABN, Publish Date - Jul 15 , 2026 | 04:20 PM

చైతన్యశక్తి, స్వాతిశ్రీ జంటగా 'కరుణామయ' సినిమా ప్రారంభమైంది. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించి, డిసెంబర్ 23న దీనిని విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.

Karunamaya Movie

బాబీ పిక్చర్స్ పతాకంపై సంకాబత్తుల నాగేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా 'కరుణామయ'. చైతన్యశక్తి, స్వాతిశ్రీ ప్రధాన పాత్రలు పోషించబోతున్న ఈ సినిమాను హర్షవర్ధన్‌ పారెళ్ళ డైరెక్ట్ చేస్తున్నారు. ఆరాధ్య హైందవి సమర్ఫణలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఈ మేరకు బుధవారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్, వి.ఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.


దర్శకుడు హర్షవర్ధన్ పారెళ్ళ మాట్లాడుతూ, 'కుటుంబ కథా చిత్రంగా మా ‘కరుణామయ’ తెరకెక్కబోతోంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా నిర్మాత నాగేశ్వరరావు గారికి థాంక్స్. తండ్రీ కొడుకు నేపథ్యంలో మంచి ఎమోషన్స్‌తో కూడిన కథగా సినిమా ఉంటుంది. మా కోసం వచ్చిన దర్శకులు వి.వి. వినాయక్ గారికి, వీ.ఎన్. ఆదిత్య గారికి ధన్యవాదాలు. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా టీం మొత్తం కష్టపడతాం. డిసెంబర్ 23న మా మూవీని రిలీజ్ చేస్తాం’అని అన్నారు.

చైతన్య శక్తి మాట్లాడుతూ, 'కరుణామయ’ చిత్రంలో నేను హీరోగా పని చేస్తున్నాను. ఇంత మంచి కథలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా మూవీని హిట్ చేస్తారని ఆశిస్తున్నాం’అని అన్నారు. స్వాతిశ్రీ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. కేవలం ఒక మతానికి చెందిన వారే కనెక్ట్ అవుతారని కాకుండా... అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోంది’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

నిన్న తండ్రితో... రేపు కొడుకుతో... నయన్ నట విన్యాసం!

పోసాని భార్యను బ్రతిమిలాడిన త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా

రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల

Updated Date - Jul 15 , 2026 | 05:22 PM