రాష్ట్రాన్ని లీడ్ చేసే అవకాశం వస్తే.. సినీ ఇండస్ట్రీలో అలా చేస్తా: కవిత కల్వకుంట్ల
ABN , Publish Date - Jul 13 , 2026 | 10:42 PM
‘వెంకట్రామయ్య గారి తాలూకా’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె.. తెలుగు ప్రజలకు సంబంధించి, అలాగే టాలీవుడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా.. మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ (Venkatramayya Gari Thaluka). సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించారు. జూలై 17న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్వకుంట్ల కవిత (Kavitha Kalvakuntla) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘చరణ్ అర్జున్ గురించి చెప్పేది ఏం లేదు. చాలా మంచి సాంగ్స్ చేస్తారు. తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన ‘మూడు రంగుల జెండా’ పాట వేస్తే.. ముఖ్యమంత్రి అయిపోయాడు. మరి ఈ సినిమా పాటలు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ, అతనిపై కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. ఇక, రెండో విషయం ఏంటంటే... ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, సినిమా పేరు ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అంటే, వాస్తవానికి తాలూకా అనే పదం మేము తెలంగాణలో వాడము. తాలూకా అంటే ఏందిరా భాయ్ అన్నట్టు ఒక సేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా.. ఇద్దరం కూడా కలిసి ఉండాలనే మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్‌గా కొట్లాడుకున్నా, మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరినీ కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే, రెండు ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఇప్పుడు తెలుగు వాళ్ళం కొట్టుకుంటూ ఉంటే, మనల్ని వచ్చి ఇంగ్లీషోడు కొడుతున్నాడు. సో, వాడి ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ, తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి.
నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే... ఎట్లా అయితే కోలీవుడ్ లో, శాండల్ వుడ్‌లో చిన్న సినిమాకు రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లా అయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్‌ని, సినిమా థియేటర్స్‌ని ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్‌కి ఇవ్వడం, చిన్న ఆర్టిస్ట్‌కి ఇవ్వడం చేస్తారో.. తెలంగాణలో అలాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్‌ని షోకేస్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సరే, ఇప్పుడు ఓటీటీ రావడంతోని ఇంకొంచెం లిబరల్ అయింది అనుకున్నాం, కానీ అది కూడా ఓ గేమ్‌గా మారిపోయింది. అట్లాంటప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్‌కి, చిన్న సినిమాలకు, మీలాగా సర్వస్వం ఒడ్డి పెట్టి, ఆస్తులు అమ్ముకొని సినిమాలు చేసేవాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి... చిన్న ప్రొడ్యూసర్స్ పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
ఆ భగవంతుడి దయవల్ల మేము రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి అవకాశం వస్తే మాత్రం, కోలీవుడ్‌లో ఎట్లా ఉందో, శాండల్ వుడ్‌లో ఎట్లా ఉందో, అట్లాంటి మంచి పాలసీ తీసుకొని వస్తాం. ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’.. బుచ్చిబాబు సంచలన పోస్ట్
కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు: శ్రష్టి వర్మ
బాలయ్యకి అన్నయ్యగా ఆ బాలీవుడ్ స్టార్.. నిజమైతే బాక్సాఫీస్ బద్దలే!