కాజల్ కొత్త అవతారం
ABN , Publish Date - Jun 15 , 2026 | 07:16 PM
టాలీవుడ్ చందమామ సెకండ్ ఇన్సింగ్స్ కమ్ బ్యాక్ గట్టిగా ప్లాన్ చేసుకుంటోంది. సినిమాలే కాదు ఛాలెజింగ్ రోల్స్ వస్తే దేనికైనా రెడీ అంటోంది. ఇప్పుడు ముద్దుగుమ్మ లైనప్ చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు.
టాలీవుడ్‌లో ఒకప్పుడు గ్లామర్‌తో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో 'చందమామ'లా వెలిగిపోయింది కాజల్ అగర్వాల్. పెళ్ళి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కాజల్... ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి రూట్ మార్చింది. కేవలం సాంగ్స్, రొమాన్స్ అనే పాత ఫార్ములాకు గుడ్ బై చెప్పేసి బాక్సాఫీస్ దగ్గర గట్టిగా ఇంపాక్ట్ చూపించే పవర్‌ఫుల్ పాత్రలపై కన్నేసింది. తాజాగా వినిపిస్తున్న క్రేజీ అప్‌డేట్ చూస్తుంటే.. కాజల్ బాక్సాఫీస్ రేస్‌లోకి మళ్ళీ స్పీడుగా దూసుకొస్తోందని అర్థమవుతోంది.
'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న 'విశాఖ' వెబ్ సిరీస్‌తో కాజల్ ఓటీటీ వరల్డ్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో విశేషం ఏంటంటే.. ముద్దుగుమ్మ ఒకే సిరీస్‌లో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తోంది. ఒక వైపు అమాయకమైన గృహిణిగా కనిపిస్తూనే.. మరోవైపు గన్ పట్టిన 'లేడీ డాన్'గా రౌడీల గుండెల్లో వణుకు పుట్టించబోతోంది. సుస్మితా సేన్ 'ఆర్య' తరహాలోనే.. ఈ 'విశాఖ' కూడా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామాగా సాగనుందని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటికే 'విశాఖ' షూటింగ్ పూర్తి చేసుకున్న కాజల్.. జులై లేదా ఆగస్టులో జియో హాట్‌స్టార్ ద్వారా మన ముందుకు రానుంది. అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్, మైండ్ గేమ్‌తో సాగే ఈ సిరీస్.. కాజల్ కెరీర్‌లోనే బెస్ట్ గా నిలుస్తుందంటున్నారు మేకర్స్. మొత్తానికి గ్లామర్ క్వీన్ కాస్తా ఇప్పుడు 'యాక్షన్ క్వీన్'గా మారుతుంటే.. అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
మామూలుగానే సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో కాస్త సేఫ్ జోన్ వెతుక్కుంటారు. కానీ కాజల్ మాత్రం ఛాలెంజింగ్ రోల్స్ తో రిస్క్ తీసుకోవడానికి ముందుకొచ్చింది. ఆ మధ్య 'సత్యభామ'లో పోలీస్ ఆఫీసర్‌గా రఫ్ అండ్ టఫ్ లుక్‌లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబో మూవీలోనూ మెయిన్ లీడ్‌గా నటిస్తూ బిజీగా ఉంది. మొత్తానికి అటు సినిమాలు ఇటు వెబ్ సిరీసులతో ఫామ్ లోకి వచ్చేందుకు గట్టిగానే కష్టపడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఇవి కూడా చదవండి:
సాయి పల్లవి అనుకున్నప్పుడు ఆ సీన్స్ లేవు: ‘మా ఇంటి బంగారం’ టీమ్‌తో చిట్ చాట్
బాలీవుడ్‌లో కనిపించని నవతరం స్టార్స్.. హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి?
ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్