'కిల్లర్' మేకర్స్ సూపర్ షీ ఛాలెంజ్!
ABN, Publish Date - Sep 16 , 2026 | 12:32 PM
జ్యోతి పూర్వజ్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'కిల్లర్' మూవీ అక్టోబర్ 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మహిళ కోసం ఆసక్తికరమైన సూపర్ షీ ఛాలెంజ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ 'కిల్లర్'. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా మేకర్స్ సూపర్ షీ ఛాలెంజ్ ను అనౌన్స్ చేశారు. రాత్రికి రాత్రే మీకు సూపర్ పవర్ వస్తే ఏం చేస్తారో చెబుతూ రీల్స్ చేసి పంపితే వారిలో బెస్ట్ రీల్స్ చేసిన పది మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అలాగే తమ ఆన్సర్స్ ను టెక్ట్స్ మెసేజ్ పంపిన వారిలో బెస్ట్ ఆన్సర్స్ పంపిన 20 మంది ఒక్కొక్కరు 2 వేల రూపాయల చొప్పున క్యాష్ ప్రైజ్ అందుకోవచ్చని తెలిపారు. త్వరలో జరగనున్న 'కిల్లర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజేతలను ఈ క్యాష్ ప్రైజ్ అందించనున్నారు. ఔత్సాహికులు తమ రీల్స్, టెక్ట్స్ మెసేజ్ లు హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్ కు ట్యాగ్ చేసి, #SuperSHE #KilleR అనే హ్యాష్ ట్యాగ్స్ రాయాలి. ఈ వివరాలను వెల్లడిస్తూ హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఓవర్సీస్ లో 'కిల్లర్' మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ 'కిల్లర్' మూవీని అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది.
ఇవి కూడా చదవండి:
కత్రీనా పని అయిపోయింది.. పూర్తిగా ఆంటీలా మారిపోయింది
అబ్బా.. భాగ్యశ్రీ అందం.. రామ్ అన్నా ఎక్కడో మచ్చేసుకోని పుట్టాడురా
కావ్య - కాలభైరవ పెళ్లి డేట్ ఫిక్స్..