సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స.. హెల్త్ బులిటెన్ విడుదల

ABN, Publish Date - Aug 12 , 2026 | 04:40 PM

ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి అయిన గాయానికి బుధవారం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు.

Jr NTR

ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) భుజానికి అయిన గాయానికి (Shoulder Injury) బుధవారం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఎన్టీఆర్ త్వరగా, సంపూర్ణంగా కోలుకోవడానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరమని వైద్య నిపుణుల బృందం నిర్ణయించడంతో.. ఈ సర్జరీ నిర్వహించారు. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ సర్జరీ విజయవంతమైందని వెల్లడించింది.


సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సూరపనేని ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఈ శస్త్రచికిత్సను సమర్థవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన చాలా ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలియజేశారు. సర్జరీ విజయవంతం కావడంతో నందమూరి అభిమానులు, సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్ త్వరలోనే ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఆయన పూర్తిగా కోలుకుని, సాధారణ స్థితికి చేరుకోవడానికి దాదాపు 2 నుండి 3 నెలల సమయం పడుతుందని కిమ్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు వెల్లడించారు. ఈ వార్త తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఆయన త్వరగా కోలుకుని, మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్‌కు సంబంధించి కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసిన బులిటెన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కెజియఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ అనే మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూట్‌లోనే ఎన్టీఆర్‌ భుజానికి గాయమైంది.

ఇవి చదవండి:

ఫ్యాన్స్ వద్దా.. జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Jani Master: తప్పులు జరిగాయి.. ద‌య‌చేసి క్ష‌మించండి

త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 12 , 2026 | 04:45 PM