ఫ్యాన్స్ వద్దా.. జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:41 PM
బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్‌లైన్‌లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్‌లైన్‌లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన గుర్తింపును ఉపయోగిస్తూ సృష్టించిన అశ్లీల కంటెంట్, ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు, వీడియోలు, నకిలీ ఖాతాలు, ఇంకా అనుమతి లేని ఇతర వినియోగాలపై నిషేధం విధించాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కన్నారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) జాన్వీ కపూర్ కోరిన ఈ ఆంక్షలపై, ముఖ్యంగా ఫ్యాన్ పేజీలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు విచారణ సమయంలో జస్టిస్ అనూప్ జైరామ్ భంబానీ (Justice Anup Jairam Bhambhani) స్పందిస్తూ... “మీకు అభిమానులు వద్దు అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఇక ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. ఫ్యాన్ పేజీలను కేవలం అక్రమమైనవిగా లేదా చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అభిమానులు నటీనటుల పనిని అభినందించడానికి, వారి చిత్రాలను పంచుకోవడానికి, చివరికి వారిని విమర్శించడానికి కూడా ఫ్యాన్ పేజీలను నిర్వహిస్తుంటారని పేర్కొంది. అయితే, జాన్వీ కపూర్ ఇమేజ్‌ను దుర్వినియోగం చేస్తూ తయారు చేసిన అశ్లీల కంటెంట్‌పై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది.
జాన్వీ కపూర్ వేసిన ఈ పిటిషన్‌లో దాదాపు 5,000 కంటే ఎక్కువ వెబ్ పేజీలు, సోషల్ మీడియా పోస్ట్‌లకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. వీటిలో ఏఐ-జెనరేటెడ్ అశ్లీల కంటెంట్, నకిలీ ప్రొఫైళ్లు ప్రధానంగా ఉన్నాయి. సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ పేరుతో సాధారణ ఫ్యాన్ యాక్టివిటీని, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా నియంత్రించలేమని ఈ విచారణ ద్వారా కోర్టు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మరి ఈ విషయమై జాన్వీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
ఇవి చదవండి:
Jani Master: తప్పులు జరిగాయి.. దయచేసి క్షమించండి
త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Dhanush Vs Vijay: ధనుష్‌పై.. విజయ్ సర్కారు నిఘా