బాలల దినోత్సవానికి ‘జయంత్ అండ్ ది జింగో పెన్’
ABN, Publish Date - Nov 07 , 2026 | 06:06 PM
జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన బాలల చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. పిల్లల మనస్తత్వం, చదువుపై ఒత్తిడి, గణితంపై భయాలను అధిగమించే సందేశంతో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, 'మన శంకర వర ప్రసాద్ గారు' ఫేమ్ ఊహా రెడ్డి, 'సత్యం' రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం వేగవంతం చేసింది.
ఈ చిత్రంలోని లిరికల్ వీడియో సాంగ్‌ను డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల అధినేత మల్క కొమరయ్య విడుదల చేశారు. డీపీఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యార్థుల ఇంటరాక్షన్ కార్యక్రమానికి ఆయన ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘పిల్లల మనస్తత్వం, చదువుపై ఒత్తిడి, ముఖ్యంగా గణితం వంటి సబ్జెక్టుల పట్ల ఉండే భయాలను అధిగమించే మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రతి విద్యార్థి చూడాలి. మార్కులే పిల్లల ప్రతిభకు కొలమానం కాదు. ప్రతి చిన్నారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే’ అని పేర్కొన్నారు. తమ విద్యాసంస్థల విద్యార్థులందరికీ ఈ చిత్రాన్ని చూపించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరిత, చిత్ర దర్శకుడు నవీన్ దేశబోయిన, కథానాయకుడు ఆశిష్ గాంధీ, బాలనటులు మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా, ఇతర నటీనటులు, చిత్ర బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలానే బాలనటి ఊహా పుట్టినరోజు వేడుకలను విద్యార్థులు, చిత్ర బృందం సమక్షంలో నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ స్టార్ హీరోస్.. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్.. వీరిదే హవా
ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే
నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్