సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఊటీలో ‘జనవరి 12 విడుదల’ టీమ్.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలే

ABN, Publish Date - Oct 12 , 2026 | 06:50 PM

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘జనవరి 12 విడుదల’. ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

January 12 Vidudala Still

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala). విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజే భారీ అంచనాలు నెలకొన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పిస్తుండగా.. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

‘జనవరి 12 విడుదల’ షూటింగ్‌ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా శరవేగంగా పూర్తి చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi). గత నెలలో మైసూర్‌లో కీలక సన్నివేశాలతో పాటు ఒక కలర్‌ఫుల్ సాంగ్‌ను కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు నేరుగా అందాల ఊటీ (Ooty) కొండల్లో వాలింది. బ్యూటీఫుల్ ఊటీ షెడ్యూల్ నా అద్భుతమైన టీమ్‌తో మొదలైంది అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు, 2027 సంక్రాంతి బరిలో సినిమాను దించుతున్నామంటూ మరోసారి గుర్తుచేశారు. ఈ తాజా ఊటీ షెడ్యూల్ దాదాపు 12 రోజుల పాటు నిరవధికంగా కొనసాగుతుందని, ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్లడించింది.


ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పాత్రే సినిమాకి అసలైన హైలైట్‌గా నిలవబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో వెంకీ మామ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ సినీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆర్మీ యూనిఫామ్, కళ్లజోడు, మెడలో స్కార్ఫ్‌తో ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’గా వెంకటేష్ కనిపిస్తున్న తీరు సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. సాధారణంగా అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్‌తో వెంకీ నవ్విస్తుంటారు.. కానీ ఈసారి మిలిటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన చేస్తున్న ఈ సీరియస్ రోల్, దానికి తోడు నందమూరి కళ్యాణ్ రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కలిస్తే థియేటర్లలో రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ఇక ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి ఆకట్టుకోనున్నారు. సీనియర్ అండ్ యంగ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌లో కేవలం యాక్షన్, కామెడీ మాత్రమే కాకుండా గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్‌కు కూడా సమపాళ్లలో ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, వెంకీ - కళ్యాణ్ రామ్‌ల మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్, మరోవైపు సంక్రాంతి సీజన్ సెంటిమెంట్ అన్నీ కలిసి ఈసారి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

‘వారణాసి’లో రామాయణ ఘట్టంపై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

30 ఏళ్ల సినీ ప్రయాణం.. పవర్ స్టార్‌కు అల్లు అరవింద్ అభినందనలు

మూడు ప్రాజెక్ట్‌లతో మెగా హీరో షాకివ్వబోతున్నాడా..

Updated Date - Oct 12 , 2026 | 06:50 PM