‘పెద్ది’ ప్రమోషన్స్‌కు జాన్వీ కపూర్ ‘నో’.. కారణం ఇదేనా?
ABN , Publish Date - May 17 , 2026 | 07:30 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా ప్రమోషన్స్‌కు హీరోయిన్ జాన్వీ కపూర్ కావాలనే దూరంగా ఉంటుందనేలా టాక్ వినిపిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’ (Peddi). జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ప్రమోషన్స్ జోరు కనిపిస్తుంది కానీ, అందులో గ్లామర్ మాత్రం మిస్సవుతుంది. అర్థం కాలేదు కదా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) మాత్రం ప్రమోషన్స్‌కు (Peddi Promotions) దూరంగా ఉండటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో ఆమె ఎక్కడా కనిపించకపోవడంపై పరిశ్రమ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలో వినిపిస్తోన్న సమాచారం ఏమిటంటే.. ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్ర నిడివి చాలా పరిమితంగా ఉంటుందట. ఈ నేపథ్యంలో, ప్రమోషన్స్‌లో పాల్గొనాలా? వద్దా? అనే ఛాయిస్‌ను మేకర్స్ ఆమెకే వదిలేశారట. దీంతో జాన్వీ కపూర్ ప్రమోషన్స్ నుంచి తప్పుకోవడానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తాను సినిమాను భారీగా ప్రమోట్ చేస్తే, థియేటర్లలో తన పాత్రపై ప్రేక్షకులు లేనిపోని అంచనాలు పెంచుకుంటారని, చివరకు స్క్రీన్ టైమ్ తక్కువగా ఉంటే నిరాశ చెందుతారని భావించే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టాక్ నడుస్తోంది.
మరోవైపు, బాలీవుడ్‌లో ఆమె అందుకునే రెమ్యునరేషన్ కంటే ఈ సినిమా కోసం ‘పెద్ది’ నిర్మాతలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని, కేవలం ఆ ఫ్యాన్సీ రేటు కోసమే జాన్వీ ఈ చిన్న పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. తన పాత్ర పరిధి తక్కువైనా.. పారితోషికం భారీగా అందడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌లో చేసేందుకు ఓకే చెప్పిందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదేమైనా, సినిమా ప్రమోషన్స్ కీలక దశకు చేరుకున్న టైమ్‌లో.. హీరోయిన్ ఇలా ప్రచారానికి దూరం కావడం మెగా అభిమానుల్లో కాస్త చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి.. ముంబై ఈవెంట్‌లో కనుక జాన్వీ మెరిస్తే.. ఈ వార్తలన్నీ కేవలం కల్పితాలే అని ఫిక్సయిపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!
లేటు వయసులో ఖరీదైన 'పోర్షే' లగ్జరీ కారు.. సీనియర్ నరేశ్ జల్సానే జల్సా! ఖరీదెంతో తెలుసా?
Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!
Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?