‘పెద్ది’ సినిమాకు జాన్వీ కపూర్ ఎంపిక కరెక్ట్ కాదా?

ABN , Publish Date - Jun 04 , 2026 | 10:45 PM

‘పెద్ది’లో రామ్ చరణ్ యాక్టింగ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అందరి హీరోల ఫ్యాన్స్.. చరణ్ యాక్టింగ్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ, జాన్వీ కపూర్ పాత్ర, నటన గురించే అంతా నిరాశ చెందుతున్నారు.

Janhvi Kapoor in Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటించిన ‘పెద్ది’ (Peddi) చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఇండస్ట్రీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో, ఎన్నిసార్లు వాయిదా వేయాల్సి వచ్చిందో అందరికీ తెలిసిందే. ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రీమియర్లకు మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్నా.. మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ దిశగా దూసుకెళుతోంది. రామ్ చరణ్ యాక్టింగ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అందరి హీరోల ఫ్యాన్స్.. చరణ్ యాక్టింగ్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర, నటన గురించే అంతా నిరాశ చెందుతున్నారు.


జాన్వీ కపూర్ ఈ పాత్రకు అస్సలు సూటవలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. పాత్రకే కాదు.. అసలు ఆమె పాత్రని డిజైన్ చేసిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌత్ సినీ దర్శకనిర్మాతలు జాన్వీ కపూర్ వెంటే ఎందుకు అంతగా పరుగులు పెడుతున్నారు? నిజంగా ఆమెకు టాలెంట్ ఉందా? మార్కెట్ ఉందా? లేదంటే.. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండా? వీటన్నింటిని మించిన ఇంకా తెలియనిది ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాకు ఎలా చూసినా జాన్వీ మిస్ కాస్టింగ్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అంతేకాదు, ఈ సినిమాకు ఆమె రూపంలో పెద్ద ఎదురు దెబ్బే తగిలిందని వాపోతున్నారు.


‘దేవర’కు ‘పెద్ది’ సినిమాకు మధ్య ఆమె చేసిన ఏదైనా సినిమా హిట్టయిందా? కనీసం చర్చల్లో అయినా ఉందా? అయినా కూడా ఎందుకు ఆమె పేరునే సౌత్‌లో తెగ వైరల్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె ఈ సినిమాలో చేయడం వల్ల నార్త్‌లో ఏమైనా టికెట్స్ తెగుతున్నాయా? అంత ఖర్చు పెట్టి సినిమా తీసేవారికి.. వేరే ఏ స్టార్ హీరోయిన్ దొరకలేదా? ఇలాంటి భారీ స్కేల్, హైప్ ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌కు ఆమె ఎలా ఛాయిస్ అవుతుంది? అంటూ.. ‘పెద్ది’లోని జాన్వీ పాత్రని, ఆమె నటనని చూసిన చాలా మంది రియాక్ట్ అవుతుండటం విశేషం. ఈ విషయంలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతల మనసులో ఏముందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ‘పెద్ది’కి జాన్వీ పెద్ద మైనస్ అనే వాదన మాత్రం సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

‘డ్రాగన్’లోని ఆ సంచనాల కోసం వెయిటింగ్ -ఎన్టీఆర్

త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్‌

Updated Date - Jun 04 , 2026 | 10:45 PM

Janhvey Kapoor: అతని ఎనర్జీ చూసి రెట్టింపు ఉత్సాహం పెరిగింది

Janhvi Kapoor: జిమ్‌ బయట అలా నాకు నచ్చదు!

Janhvi Kapoor : టీనేజ్‌లోనే ఆ సమస్యలు ఎదుర్కొన్నా..!

Janhvi Kapoor: పుష్పరాజ్‌తో ఆడిపాడటానికి సై?

Janhvi Kapoor: అందాలను ఆరబోయడమేనా.. ఏమైనా అభినయం చూపించేది ఉందా