Janhvi Kapoor: అందాలను ఆరబోయడమేనా.. ఏమైనా అభినయం చూపించేది ఉందా
ABN , Publish Date - Nov 08 , 2025 | 08:28 PM
సాధారణంగా వారసులు ఇండస్ట్రీకి పరిచయమైతే వారిమీద ఒక ప్రెషర్ ఉంటుంది. తండ్రి పేరును నిలబెట్టేలా నటిస్తున్నాడా..? విజయాలను అందుకుంటున్నాడా.. ?
Janhvi Kapoor: సాధారణంగా వారసులు ఇండస్ట్రీకి పరిచయమైతే వారిమీద ఒక ప్రెషర్ ఉంటుంది. తండ్రి పేరును నిలబెట్టేలా నటిస్తున్నాడా..? విజయాలను అందుకుంటున్నాడా.. ? అని.. అయితే ఇదే ప్రెషర్ వారసురాళ్ల మీద కూడా ఉంటుంది. హీరోయిన్ వారసురాలిగా వచ్చిన కూతురు.. తల్లి అంత గొప్ప పేరు తెచ్చుకుంటుందా.. ? ఆమె అంత గొప్ప స్థాయికి వెళ్తుందా.. ? అనేది కూడా ఫ్యాన్స్ చూస్తూ ఉంటారు. అలా లేనప్పుడు నిర్మొహమాటంగా తల్లి పరువు తీస్తుంది అని టక్కున మాట అనేస్తారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ను కూడా నెటిజన్స్ ఆ మాట అనేస్తున్నారు.
అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీదేవి నటించిన సినిమాలు, ఆ అందం.. దానికి మించి అభినయం. ప్రపంచం మొత్తంలో మరో శ్రీదేవి ఎక్కడా కనిపించదు. ఇంకెప్పటికీ పుట్టదు అనేంతలా ఆమె పేరు గడించింది. ఇక ఆమె నటవారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అందంలో తల్లిని మించిందేమో కానీ.. అభినయంలో మాత్రం తల్లి దగ్గరకు కూడా రాలేకపోయింది. ముఖ్యంగా టాలీవుడ్ లో జాన్వీ ఎంచుకున్న కథలు మరింత ట్రోలింగ్ కు గురిచేస్తుంది.
దేవర సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఎన్టీఆర్ సరసన అంటే మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రేమో అనుకున్నారు. తంగం పాత్రలో అమ్మడు అదరగొట్టేస్తుందేమో అనుకోని సినిమాకు వెళితే.. అందాల ఆరబోత తప్ప అక్కడ ఏమి లేదు. సరే మొదటి సినిమా కదా.. తెలియలేదేమో అనుకున్నారు. గ్లామర్ మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను ఎంచుకోవాలని సలహాలు కూడా ఇచ్చారు. కనై, ఈసారి కూడా అమ్మడు గ్లామర్ కే ఓటు వేసింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా అమ్మడు కేవలం అందాల ఆరబోత చేయడానికి మాత్రమే ఉందనిపిస్తుందని చికిరి చికిరి సాంగ్ ను బట్టి అర్థమవుతుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇక ఈ రెండు సినిమాల్లో కూడా అమ్మడు అందాలను ఆరబోస్తూనే కనిపించింది. జాన్వీ కావాలనే ఇలాంటి పాత్రలను ఎంచుకుంటుందా.. ? లేక డైరెక్టర్స్ ఆమెను చూడగానే అలాంటి పాత్రలే రాయాలనుకుంటారో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ చుసిన నెటిజన్స్ జాన్వీని ట్రోల్ చేస్తున్నారు. అందాలను ఆరబోయడమేనా.. ఏమైనా అభినయం చూపించేది ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి పెద్ది సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
Jana Nayagan First Song: దళపతి కచేరి.. అనిరుధ్ గట్టిగా వాయించేశాడు
Akkineni Nagarjuna: బిగ్ బాస్ స్టేజిపై నాగ్ తో అమల డ్యాన్స్..