ఎమోషనల్ లవ్ స్టోరీ ‘జాన్’ ఫస్ట్ లుక్ విడుదల
ABN, Publish Date - Sep 25 , 2026 | 05:21 PM
లక్ష్మీ నరసింహా మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్యన్ గౌర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాన్’. ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ వదిలారు.
ఫీల్ గుడ్ ప్రేమకథలను ఆదరించే తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు మరో సరికొత్త ఎమోషనల్ లవ్ స్టోరీ సిద్ధమవుతోంది. లక్ష్మీ నరసింహా మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆర్యన్ గౌర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాన్’ (JAAN). ఆర్యన్ గౌర (Aryan Gowra), మోనిషా మోహన్ (Monisha Mohan) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, బాబా భాస్కర్, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజ జీవితంలో చోటుచేసుకున్న యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ, గాఢమైన అనుబంధం, జీవితపు ఒడిదొడుకుల్లో ఒకరికొకరు తోడుగా నిలిచే అద్భుతమైన భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు.
ఈ పోస్టర్‌లో వీల్‌చైర్‌లో కూర్చున్న కథానాయిక మోనిషా వెనుక హీరో ఆర్యన్ నిలబడి, ఆ వీల్‌చైర్ హ్యాండిల్స్‌పై ఆప్యాయంగా చేతులు ఉంచి కనిపిస్తున్నారు. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల నేపథ్యంలో ముఖంపై చిరునవ్వుతో కనిపిస్తున్న మోనిషా లుక్, పోస్టర్‌పై పొందుపరిచిన “Forever” అనే పదం కథలోని గాఢతను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్ డిజైన్‌లోనే వీల్‌చైర్‌ను క్రియేటివ్‌గా భాగం చేయడం సినిమా ప్రత్యేకతను చాటుతుండగా, పోస్టర్‌లో ఒక పెంపుడు డాగ్ కూడా కనిపిస్తూ మరింత ఆకర్షణ తెచ్చిపెట్టింది.
ఈ చిత్రానికి మూడు సార్లు జాతీయ అవార్డు సాధించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటం ప్రధాన బలంగా మారింది. ‘సూరరై పొట్రు’, ‘వాతి’ చిత్రాలతో పాటు ఇటీవల ‘అమరన్’ చిత్రానికి గాను నేషనల్ అవార్డును అందుకుని తన ఖాతాలో మూడు జాతీయ పురస్కారాలను జమచేసుకున్న ఆయన, ‘జాన్’ కోసం మనసును హత్తుకునే సంగీతాన్ని సమకూర్చుతున్నారని మేకర్స్ చెబుతున్నారు. హృదయాన్ని కదిలించే కథనంతో రానున్న ఈ ఫీల్ గుడ్ మూవీపై తాజా ఫస్ట్ లుక్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇవి కూడా చదవండి:
జర్నలిస్ట్ బాడీ షేమింగ్‌పై సంపూ క్లారిఫికేషన్.. ఏమన్నారంటే
కథల ఎంపికలో టాలీవుడ్ స్టార్స్ స్ట్రిక్ట్ రూల్స్.. ఎందుకంటే
‘హనుమాన్ అంశ్’ తెలుగు ఊసేది.. ‘ఏకే 47’ పాటేది.. అసలేం జరుగుతుంది?