సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Irumudi: 250 కోట్ల సినిమా.. అసలు లాజిక్స్ లేకుండా ఎలా తీశార్రా బాబు

ABN, Publish Date - Sep 19 , 2026 | 04:13 PM

ఈమధ్యకాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలో రికార్డు వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించినప్పటికీ, ఓటీటీలోకి వచ్చాక మాత్రం మిశ్రమ స్పందన అందుకుంటున్నాయి.

Irumudi

ఈమధ్యకాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలో రికార్డు వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించినప్పటికీ, ఓటీటీలోకి వచ్చాక మాత్రం మిశ్రమ స్పందన అందుకుంటున్నాయి. అంతేకాకుండా, డిజిటల్ వేదికలపైకి రాగానే కావాలనే కొన్ని వర్గాలు నెగిటివ్ ట్రోల్స్ చేయడం ఒక పరిపాటిగా మారింది. గతంలో జాతి రత్నాలు, ఉప్పెన, మిరాయ్, మన శంకరవరప్రసాద్ గారు, సంక్రాంతికి వస్తున్నాం, కొరియన్ కనకరాజు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్ తర్వాత ఎన్నో విమర్శలు, మిశ్రమ స్పందననే ఎదుర్కొన్నాయి. ఇక ఇప్పుడు ఇరుముడి వంతు వచ్చింది.


థియేటర్లలో రికార్డు కలెక్షన్లు సాధించి, రూ. 200 కోట్లకు పైగా రాబట్టిన రవితేజ ఇరుముడి సినిమా కేవలం 28 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ముందస్తు ఒప్పందాల ప్రకారం నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. అసలు ఇందులో అసలు లాజిక్ ఏముంది? ఈ సినిమాను ఎలా హిట్ చేశారు? అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా మణికంఠ మరణించడం వెనుక అసలు లాజిక్ లేదని.. బస్సు లేని ఊరు నుంచి ఆ చిన్నారి ఎలా అంతా దూరం వెళ్లింది.? పుష్పవతి అయిన మణికంఠని తల్లి అర్ధరాత్రి బయటకు ఎలా పంపింది..? రవితేజ ఉన్నాడని తప్ప.. కథ మొత్తం చాలా సినిమాల్లో వచ్చింది.. చాలా లోపాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.


నిజం చెప్పాలంటే సినిమాలో లోపాలు చాలా ఉన్నాయి. కానీ, వాటిని లెక్కచేయకుండా థియేటర్ లో స్క్రీన్ ప్రజెన్స్, ఫాస్ట్ పేసింగ్ మ్యాజిక్ వల్ల ఆడియన్స్ ఆ మైనస్‌లను అసలు పట్టించుకోలేదు. ఇప్పుడంటే ఓటీటీలో వచ్చింది. ఎక్కడ లాజిక్ లేదు అని సినిమాని ఆపి మరీ చూసి కనిపెడుతున్నారు. అంతేకాకుండా కొన్ని సినిమాలు థియేటర్ లో ఇచ్చే కిక్కు.. టీవిలో ఉండదు. థియేటర్‌లో మల్లెపూల పల్లకి లాంటి సాంగ్స్ వస్తున్నప్పుడు వందలాది మందితో కలిసి డాన్స్ చేయడం, భారీ డాల్బీ సౌండ్‌లో ఆ అనుభూతిని పొందడం వేరే లెవెల్‌లో ఉంటుంది. అయినా థియేటర్లో ఆడి, రికార్డులు సృష్టిస్తూ రూ. 200 కోట్ల మార్కును దాటేసిన ఈ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కు ఇప్పుడు ఓటీటీలో కొత్తగా బాగుంది.. బాలేదు అని సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టమూ లేదు.

ఇవి కూడా చదవండి:

Chiranjeevi: చిరంజీవి నన్ను చెప్పుతో కొట్టినా ఫీలవ్వను.. కానీ అందుకు ఫీలయ్యా

​‘డ్రాగన్’.. సెట్స్‌లోకి ఎన్టీఆర్ ఎంటరయ్యేది ఎప్పుడంటే

గ్యాంగ్‌స్టర్ డ్రామానే కాదు.. ‘దాదా’లో అసలు హైలైట్ అదే!

Updated Date - Sep 19 , 2026 | 04:50 PM