Chiranjeevi: చిరంజీవి నన్ను చెప్పుతో కొట్టినా ఫీలవ్వను.. కానీ అందుకు ఫీలయ్యా

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:30 PM

మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానులకు కేవలం ఒక హీరో కాదు.. ఒక ఎమోషన్. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానుల గుండెల్లో ఆనందం ఉప్పొంగుతుంది. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అంటే అభిమానులకు కేవలం ఒక హీరో కాదు.. ఒక ఎమోషన్. ఆయన తెరపై కనిపిస్తే చాలు అభిమానుల గుండెల్లో ఆనందం ఉప్పొంగుతుంది.  స్టార్‌డమ్‌ కంటే.. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న మంచితనం, ఎదుటి వారిని గౌరవించే తీరు మరింత గొప్పదని చెబుతుంటారు. తాజాగా రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి (BVS Ravi) చెప్పిన ఓ సంఘటన కూడా చిరంజీవి మనసెంత గొప్పదో తెలియజేస్తోంది.

‘మన శంకర వర ప్రసాద్’ విజయానంతరం జరిగిన ఓ డిన్నర్ పార్టీలో చిరంజీవిని కలిసిన సందర్భాన్ని బీవీఎస్ రవి గుర్తుచేసుకున్నారు. ''మెగాస్టార్‌పై ఉన్న అభిమానంతో ఆయన రాగానే సీటు చూపించడం, ప్లేట్ పెట్టడం, మంచినీళ్లు అందించడం వంటి పనులు చేస్తాను. అయితే అభిమానంతో  చేసిన ఈ పనులతో చిరంజీవికి కొంత అసౌకర్యం కలిగింది. దీంతో ఆయన కాస్త గట్టిగా కూర్చోమని చెప్పారు. ఆ మాటతో నొచ్చుకుని అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోయాను. సాధారణంగా ఇలాంటి చిన్న సంఘటనలు అక్కడితోనే ముగిసిపోతాయి. కానీ చిరంజీవి విషయంలో అలా జరగలేదు. వారం రోజుల తర్వాత ఊహించని విధంగా చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి ఇంటికి పిలిచారు. ఇంట్లో మాట్లాడుతున్న సమయంలో ఆ రోజు జరిగిన విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రస్తావించారు. తాను కాస్త గట్టిగా మాట్లాడటానికి కారణం ఏమిటో వివరించేందుకు ఆయన ప్రయత్నించారు.  అసలు ఆయన నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కానీ అంతటి వ్యక్తి నాకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆయన మంచితనం ముందు మనం ఎంత?’’ అనే భావన నాలో కలిగింది' అని బీవీఎస్ రవి గుర్తు చేసుకున్నారు. 'మీరు చెప్పుతో కొట్టినా ఫీల్ అవ్వను సర్.. ఇలా చిన్న విషయానికి వివరణ ఇవ్వడం ఏమి బాగోలేదు' అని నేను ఆయనకు  చెప్పాను' అని అన్నారు. స్టార్‌డమ్‌ ఉన్నవాళ్లు చాలామంది ఉండొచ్చు.. కానీ తమకంటే చిన్నవారికి కూడా గౌరవం ఇచ్చే మనసున్న వ్యక్తులు చాలా అరుదు. చిరంజీవితో జరిగిన ఈ చిన్న సంఘటనలో అలాంటి గొప్ప వ్యక్తిత్వమే కనిపిస్తోందంటూ బీవీఎస్ రవి చెప్పిన మాటలకు  అభిమానులను కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. 

Updated Date - Sep 19 , 2026 | 03:42 PM