సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Irumudi Ganesh: రవితేజ ‘ఇరుముడి’ ఎఫెక్ట్.. గణేశుడి విగ్రహంలోనూ అదే థీమ్!

ABN, Publish Date - Sep 12 , 2026 | 12:07 PM

వినాయక చవితి వేడుకలకు వైజాగ్‌లో ‘ఇరుముడి’ సినిమా థీమ్‌తో తయారు చేసిన గణేశుడి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

వినాయక చవితి వేడుకలకు వైజాగ్‌లో ‘ఇరుముడి’ (Irumudi) సినిమా థీమ్‌తో తయారు చేసిన గణేశుడి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. రవితేజ నటించిన ‘ఇరుముడి’ ఇటీవల విజయాన్ని అందుకున్న నేపథ్యంలో.. అదే కాన్సెప్ట్‌ను గణేశుడి (Irumudi Ganesh) విగ్రహంలో చూపించారు. దీంతో ‘ఇరుముడి’ సినిమా క్రేజ్‌కు తగ్గట్టుగానే ఈ గణేశుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. సినిమా థీమ్‌తో గణేశుడిని ఇలా డిజైన్ చేయడం ఆసక్తికరంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడు వారాలు పూర్తయిన తర్వాత కూడా పలు థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ₹200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా.. మూడో వారం ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹225 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ చెబుతున్నారు.

‘ఇరుముడి’తో రవితేజ మరోసారి తన మాస్ ఇమేజ్‌కు భిన్నమైన ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకున్నారు. అయ్యప్ప దీక్ష నేపథ్యంలో తండ్రి, కుమార్తె మధ్య అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను తెరకెక్కించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని మేళవించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ‘మల్లెపూల పల్లకి’ సహా సినిమాలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.   ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు.   

ALSO READ:

‘ఎండ్‌గేమ్’ కోసం మరోసారి థియేటర్లకు వెళ్లాల్సిందే.. ఇదిగో స్పెషల్ రీజన్!

TFTDDA: జానీ మాస్టర్ వైఫ్ సుమలత స్కెచ్ అదిరిందిగా.. కోర్టు సంచలన తీర్పు

Updated Date - Sep 12 , 2026 | 12:34 PM