‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత..’ సాంగ్ రిలీజ్.. ఎలా ఉందంటే
ABN, Publish Date - Sep 11 , 2026 | 06:25 PM
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ వదిలారు.
వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (Bunny Vas), జీనియస్ డైరెక్టర్ సుకుమార్‌లకు చెందిన బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, తబితా సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో సోషల్ మీడియాలో విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నాగదుర్గ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, తెలంగాణ నేటివిటీ, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన పూర్తి వినోదాత్మక డ్రామాగా యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘శ్రీలత..’ (Srilatha Lyrical Song) అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాట వినసొంపైన మెలోడీతో పాటు చక్కటి విజువల్ ట్రీట్‌ను అందిస్తోంది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తనదైన క్లాసిక్, ఆహ్లాదకరమైన మెలోడీ ట్యూన్‌తో ఈ పాటను కంపోజ్ చేయగా, గేయ రచయిత అలరాజు అందించిన లిరిక్స్ పాట మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. సింగర్స్ శంకర్ బాబు, మోహన భోగరాజు, శీలం పున్నమ్మ, బొల్లెపోగుల సుభద్రలు పాటను రిపీటెడ్ మోడ్‌లో వినాలనిపించేలా పాడారు. అందమైన రాత్రి వేళ లొకేషన్లలో, తెలంగాణ సెక్రటేరియట్ పరిసరాల్లో పిక్చరైజ్ చేసిన దృశ్యాలు, చిన్నారులతో చేయించిన క్యూట్ డ్యాన్స్ మూమెంట్స్ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాటలో ప్రియదర్శి, నాగదుర్గ (Nagadurga)ల మధ్య పండిన అమాయకపు ప్రేమానురాగాలు, వారిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ సాంగ్ విడుదలైన కొద్దిసేపట్లోనే శ్రోతల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కాగా, ప్రస్తుతం శరవేగంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బన్నీ వాస్, సుకుమార్ వంటి క్రేజీ కాంబోలో ప్రియదర్శి మార్క్ కామెడీ అండ్ ఎమోషన్స్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి:
వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ టీజర్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్‌లో నో ఛేంజ్
కొరటాల రిక్వెస్ట్.. బాలయ్య యాక్సెప్ట్.. ఇక దబిడి దిబిడే!
ట్రాక్ మీదకి కమల్, శంకర్‌ల ‘ఇండియన్ 3’