ట్రాక్ మీదకి కమల్, శంకర్‌ల ‘ఇండియన్ 3’

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:40 PM

ఒకప్పుడు సౌత్‌ ఇండియన్‌ లెజెండరీ దర్శకులలో శంకర్ పేరు ముందు వరుసలో ఉండేది. కానీ గత కొంత కాలంగా ఆయన తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఘోరమైన పరాజయాన్ని చూస్తున్నాయి.

Indian 3 Movie Update

ఒకప్పుడు సౌత్‌ ఇండియన్‌ లెజెండరీ దర్శకులలో శంకర్ (Director Shankar) పేరు ముందు వరుసలో ఉండేది. కానీ గత కొంత కాలంగా ఆయన తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఘోరమైన పరాజయాన్ని చూస్తున్నాయి. ఇందులో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘ఇండియన్‌ 2’ (Indian 2) కూడా ఉంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం సూపర్‌ హిట్‌ అయిన ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంపై మొదట్లో భారీ అంచనాలే క్రియేట్‌ అయ్యాయి. కానీ రిలీజ్‌ అయ్యాక బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచింది. అంతే, ‘ఇండియన్ 2’ సినిమా సీక్వెల్‌పై బజ్‌ ఒక్కసారిగా డౌన్‌ అయిపోయింది.


‘ఇండియన్‌-2’ భారీ డిజాస్టర్ కావడంతో ‘ఇండియన్‌-3’ (Indian 3) చిత్రంపై లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions) మళ్లీ భారీ పెట్టుబడి పెట్టే ఆలోచనను మానుకున్నారు. ఆ తర్వాత ఆ ఇష్యూ అలాగే కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం శంకర్‌ ‘ఇండియన్‌-3’ చిత్రాన్ని మళ్లీ లైన్‌లోకి తీసుకొచ్చాడని టాక్‌ వినిపిస్తోంది. చెన్నై ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, మేకర్స్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. ‘ఇండియన్ 2’తో పాటు ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూడో భాగానికి సంబంధించి దాదాపు ముగింపు దశ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కేవలం కొద్దిపాటి ప్యాచ్ వర్క్ అలాగే అత్యంత కీలకమైన సిజీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ మిగిలిన చిన్నపాటి పనులను సైతం వీలైనంత త్వరగా ఫినిష్ చేసి, సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని లైకా ప్రొడక్షన్స్‌ ప్లాన్ చేస్తోంది.


దర్శకుడు శంకర్ గత చిత్రాల ఫలితాలు ఆయన కెరీర్‌పై కొంత ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన మ్యాజిక్ చేయలేకపోవడంతో, శంకర్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 3’ సక్సెస్ ఆయనకు కెరీర్ పరంగా చాలా కీలకం కానుంది. పైగా కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కూడా ‘ఇండియన్‌-3’ విషయంలో సహకరిస్తానని హామీ ఇచ్చారట. మూడో భాగంలో సేనాపతి అసలు చరిత్ర, బ్రిటిషర్ల కాలం నాటి పోరాటం వంటి ఎపిసోడ్స్ హైలైట్ కానున్నాయని సమాచారం. రెండో భాగంపై వచ్చిన మిక్స్‌డ్‌ టాక్‌ను ఈ మూడో భాగంతో పూర్తిగా కవర్ చేసి, ఫ్రాంచైజీకి అదిరిపోయే ముగింపు ఇవ్వాలని టీమ్ గట్టి పట్టుదలతో ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ అప్‌డేట్స్‌పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘డీసీ’ బ్లాక్‌బస్టర్ హిట్.. మారన్ సార్ మళ్లీ మొదలెట్టారుగా!

‘ది ప్యారడైజ్’ మాస్ అప్‌డేట్.. రిలీజ్‌పై ఇక నో డౌట్

అప్పుడే ఫస్ట్ బర్త్‌డే.. వాయువ్ తేజ్ ఎంత ముద్దుగా ఉన్నాడో

Updated Date - Sep 11 , 2026 | 04:40 PM