యంగ్ టైగర్ వదిలిన ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jul 30 , 2026 | 08:14 PM

వెర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ యామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.

NTR Released I am Game Telugu Trailer

వెర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఐ యామ్ గేమ్’ (I Am Game). నహాస్ హిదాయత్ (Nahas Hidayath) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ ఆగస్ట్ 20న ‘ఓనం’ పండుగ స్పెషల్‌గా విడుదలకానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘‘ఐ యామ్‌ గేమ్ ట్రైలర్‌ (I Am Game Trailer)లోని ఆ ఫైరీ వైబ్ నాకు బాగా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకు ఎంతో గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా ట్రైలర్ ఉంది. నా సోదరుడు దుల్కర్ మరో స్పెషల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని నమ్మకం కలిగింది. తనకి మంచి విజయాన్ని ఈ చిత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అతనితో పాటు మొత్తం చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని తెలుపుతూ ఎన్టీఆర్ ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు.


ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. ఆద్యంతం ఆడియెన్స్‌ను ఉత్కంఠకు గురిచేసే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్‌ చిత్రమిదని ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. విజువల్స్, ఉత్కంఠభరితమైన యాక్షన్, హై-ఆక్టేన్ ఛేజ్ సీక్వెన్స్‌లతో ‘ఐ యామ్ గేమ్’ మూవీ ఉండబోతోందనే విషయం ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. సినీ ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని స్టైలిష్ ఫాంటసీ థ్రిల్లర్‌ చిత్రమిదనే విషయం ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇంతకుముందెన్నడూ చూడని అల్ట్రా-స్టైలిష్, మాస్ అవతార్‌లో దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘ఆర్డీఎక్స్’ తర్వాత దర్శకుడు నహాస్ హిదాయత్ నుంచి వస్తోన్న చిత్రమిది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా థియేటర్లలోకి రానుంది.


దక్షిణ భారతదేశంలోని 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన ‘ఐ యామ్ గేమ్’ చిత్రం, ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని.. పరిశ్రమలోనే అత్యంత భారీ విడుదలల్లో ఒకటిగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్ర సంగీత హక్కులను జీ మ్యూజిక్ సొంతం చేసుకోగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ట్రైలర్‌లో ఆయన అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు జిమ్షి ఖలీద్ అందించిన విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లను అన్బరివ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా’ తర్వాత వేఫేరర్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న చిత్రం.. దుల్కర్ సల్మాన్‌కు 40వ చిత్రం. ఇందులో ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు-దర్శకుడు మిస్కిన్, కయాదు లోహర్, కథిర్, పార్థ్ తివారీ, తమిళ నటి సంయుక్త విశ్వనాథన్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘రామాయణ’లో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం

పావలా శ్యామల గురించి ఘోరంగా రాశారు.. ఇక ఆపండి: కరాటే కళ్యాణి

Spider-Man: Brand New Day Review: స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ

Updated Date - Jul 30 , 2026 | 08:14 PM