Toxic: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో అమ్ముడుపోని పరిస్థితి

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:18 PM

ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే అన్నట్లు.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనుకుంటే ఏ రేంజ్ కి పడిపోయిందో చూస్తుంటే షాకింగ్ గా ఉంది.

Yash

ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే అన్నట్లు.. కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనుకుంటే ఏ రేంజ్ కి పడిపోయిందో చూస్తుంటే షాకింగ్ గా ఉంది. యష్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం టాక్సిక్ (Toxic). దాదాపు నాలుగేళ్ళు ఆగి మరీ యష్ ఈ కథను ఏరికొరి ఎంచుకున్నాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించినా, కంటెంట్ ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకులు దారుణంగా నిరాశపడ్డారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను మిగిల్చడమే కాకుండా, ఇప్పుడు ఓటీటీ బిజినెస్‌లోనూ మేకర్స్‌కి తీరని షాక్ ఇస్తోంది.


సినిమా రిలీజ్‌కి ముందు భారీ సక్సెస్ సాధిస్తుందనే ధీమాతో, తాము అడిగిన రేటు ఇస్తేనే ఓటీటీ డీల్ లాక్ చేస్తామని మేకర్స్ బిగిసి కూర్చున్నారు. కానీ థియేట్రికల్ రన్ తేడా కొట్టడంతో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ సినిమా హక్కులను దక్కించుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. మొదట రూ. 200 కోట్లుగా ప్రచారంలో ఉన్న ఈ డీల్ వాల్యూ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రూ. 30 కోట్లకు పడిపోయింది.


ఇప్పుడు తాజా రూమర్స్ ప్రకారం, ఆ రూ. 30 కోట్ల ఆఫర్ కూడా వర్కవుట్ అయ్యేలా లేదని, బిజినెస్ మరింత దారుణంగా పడిపోయిందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో కోలుకోలేని దెబ్బతిన్న టాక్సిక్ మేకర్స్‌కు ఓటీటీ సంస్థల నుంచి ఆశించిన డిమాండ్ లేకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ పరిణామాల మధ్య టాక్సిక్ అసలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో, ఏ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందో వేచి చూడాలి.

Also Read:

మోక్షజ్ఞ ఎంట్రీకి వశిష్ట మైండ్ బ్లోయింగ్ ప్లాన్

త్వరలో బెజవాడకు.. తమిళనాడు ముఖ్యమంత్రి

Chiranjeevi: 11న కపిలేశ్వరపురానికి.. మెగాస్టార్ చిరంజీవి

Updated Date - Oct 09 , 2026 | 04:18 PM