Chiranjeevi: 11న కపిలేశ్వరపురానికి.. మెగాస్టార్ చిరంజీవి
ABN , Publish Date - Oct 09 , 2026 | 03:20 PM
చాలా ఏళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తూర్పుగోదావరి జిల్లాకు రాబోతున్నారు.
చాలా ఏళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మళ్లీ తూర్పుగోదావరి జిల్లాకు రాబోతున్నారు. ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభానికి వస్తున్నట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో జీఎస్ఎల్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో సూర్య చారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ హెల్త్ కేర్ సెంటర్ను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభిస్తారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.. అనంతరం ఆయన స్థానిక జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చాలా కాలం తరువాత చిరంజీవి రాక నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన కపిలేశ్వ రపురంలో ఈనెల 11న సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంట లకు రాజానగరం జీఎస్ ఎల్ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్మించిన సూర్యచారిటబుల్ హెల్త్ కేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. చిరంజీవి రాక సందర్భంగా గ్రామంలో భారీ ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టారు. తాను పుట్టిన గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందిచాలన్న లక్ష్యంతో జీఎస్ఎల్ ఆసుపత్రి అధినేత గన్ని భాస్కరరావు హెల్త్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.