త్వరలో బెజవాడకు.. తమిళనాడు ముఖ్యమంత్రి

ABN , Publish Date - Oct 09 , 2026 | 03:37 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు దళపతి విజయ్ విజయవాడకు రానున్నట్లు సమాచారం.

Vijay

త‌న‌దైన శైలి సినిమాల‌తో దళపతిగా అభిమానుల మనసులు గెలుచుకున్న దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Tamil Nadu CM Vijay) ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో విజ‌య‌వాడ (Vijayawada) నగరానికి రానున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రి ( Indrakeeladri)పై జరగనున్న దసరా శరన్నవరాత్రుల్లో ఒక రోజు కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఏ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

అదే రోజున విజయవాడ ఉత్సవ్లో కూడా పాల్గొననున్నారు. పున్నమిఘాట్ (Vijay Punnami Ghat) లో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్నారు. విజయ్‌కు త‌మిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వీరంతా ఇప్పటికే సోషల్ మీడియాలో గ్రాండ్ వెల్కమ్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 04:01 PM