సాయి మాచిరాజుతో హీరో ప్రిన్స్ వివాహం.. ఫొటోలు వైరల్
ABN, Publish Date - Aug 24 , 2026 | 12:49 PM
‘బస్ స్టాప్’, ‘నేను శైలజ’, ‘డీజే టిల్లు’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రిన్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
‘బస్ స్టాప్’, ‘నేను శైలజ’, ‘డీజే టిల్లు’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రిన్స్ వివాహ బంధంలోకి (Hero Prince Marriage) అడుగుపెట్టారు. తన చిరకాల స్నేహితురాలు సాయి మాచిరాజు (Sai Machiraju)ను ఆయన పెళ్లాడారు. న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రదేశంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను నిర్వహించారు.
వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలలో వధూవరులిద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ కనిపించారు. ప్రిన్స్ సంప్రదాయ కుర్తా, ధోతీలో హ్యాండ్‌సమ్‌గా దర్శనమివ్వగా.. వధువు సాయి మాచిరాజు ఎరుపు, గోల్డెన్ జరీ పట్టుచీరలో సంప్రదాయ ఆభరణాలతో ఎంతో అందంగా ముస్తాబయ్యారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ఘట్టం, మాంగల్యధారణ, ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటున్న క్షణాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
హీరో ప్రిన్స్ కొత్త జీవితాన్ని ప్రారంభించిన సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు, తోటి నటీనటులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఈ నవ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ జంట నిండు నూరేళ్లు ఆనందంగా, అన్యోన్యంగా జీవించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ షో ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత చేరువైన ప్రిన్స్, ప్రస్తుతం వరుస సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
‘మహాకాళి’ గ్లింప్స్ రివ్యూ: శుక్రాచార్యుడి యుద్ధ శంఖారావం.. గూస్‌బంప్స్ పక్కా
వరుసగా 200 కోట్ల క్లబ్‌లోకి సూర్య.. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ పోస్టర్ వైరల్
T-Rex అంటే అర్థమిదేనా శ్రీకాంత్ ఓదెల?.. చిరుని ఏం పోల్చావయ్యా