అందరినీ ఆకట్టుకునేలా 'హ్యాపీ జర్నీ'
ABN , Publish Date - Sep 03 , 2026 | 07:57 PM
హ్యాపీ జర్నీ మూవీ ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ చిత్రాన్ని అభిరామ్ నాయుడు డైరెక్ట్ చేశారు.
మహిళల భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
‘హ్యాపీ జర్నీ’ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో విమానాశ్రయం బ్యాక్‌డ్రాప్‌లో చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా సందడిగా, సరదాగా కనిపిస్తున్నారు. ట్రావెల్ బ్యాగులు, బ్యాక్‌గ్రౌండ్‌లో విమానం, పేపర్ ప్లేన్ మోటిఫ్ సినిమాకు సంబంధించిన ట్రావెల్ థీమ్‌ను హైలైట్ చేస్తున్నాయి. ఈ పాత్రలు సాగించే ప్రయాణం వారి జీవితాలపై చెరగని ప్రభావాన్ని చూపించబోతోందనే విషయాన్ని సూచిస్తోంది.
‘హ్యాపీ జర్నీ’ కేవలం విదేశీ ప్రదేశాలకు చేసే ప్రయాణం గురించి మాత్రమే కాదు. ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతూనే, ఈ సినిమా రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, వ్యక్తిగత అనుభవాలు, ఒకే ప్రయాణంలో ఏర్పడే బంధాలను ఆవిష్కరిస్తుంది. విభిన్నమైన పాత్రలను కథకు కేంద్రంగా తీసుకుని, భిన్నమైన కోణాలను చూపించడంతో పాటు, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ కోర్‌ను సహజంగా చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా హార్ట్‌వార్మింగ్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. విడుదల తేదీ ఖరారు కావడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత ముమ్మరం చేసి, సినిమాపై బజ్‌ను మరింత పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి శేఖర్‌చంద్ర సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ డేట్ ఫిక్స్.. వర్కవుట్ అవుతుందా!?
Pakeezah: అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్
C. Kalyan: అధ్యక్షుడిగా ఏకగ్రీవం.. నిర్మాతల సంక్షేమమే మా లక్ష్యం..