సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్.. గురూజీకి పోటీగా!

ABN, Publish Date - Oct 02 , 2026 | 01:08 PM

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ చిత్రం, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

Hanuman Ansh and Trivikram

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘హనుమాన్ అంశ్’ (Hanuman Ansh). ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కొన్ని రోజులుగా ఏర్పడిన అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ రిలీజ్ డేట్ ప్రకటనతో టాలీవుడ్‌లో ఊహించని బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.


వాస్తవానికి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పిస్తున్నట్లుగా గతంలో వార్తలు, అధికారిక ప్రకటనలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో చిత్ర యూనిట్‌కు, ఆయనకు మధ్య తలెత్తిన విభేదాల కారణంగా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, దాంతో తెలుగు విడుదల ఆగిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఇక తెలుగులో ఈ సినిమా విడుదల కాదేమోనని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇస్తూ.. ఏకంగా గురూజీ త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47’ (Aadarsha Kutumbam House No: 47) రిలీజ్ రోజే ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ కూడా బరిలోకి దిగుతోంది. అక్టోబర్ 9న ఈ రెండు చిత్రాలు ఒకే రోజు థియేటర్లలోకి రానుండటంతో టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.


స్వయంభు మీడియా నెట్‌వర్క్ సమర్పిస్తున్న ఈ డివైన్ చిత్రాన్ని.. పాన్ ఇండియా స్థాయిలో ‘కెజియఫ్, కాంతార’ వంటి భారీ బ్లాక్‌బస్టర్లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రపంచవ్యాప్తంగా తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త తెలుగు పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేస్తూ అక్టోబర్ 9న థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. తనను వదిలి వెళ్లిన ప్రాజెక్ట్ నేరుగా తన సొంత సినిమాకే పోటీగా థియేటర్లలో దిగుతుండటంతో.. అక్టోబర్ 9న బాక్సాఫీస్ వద్ద గురూజీ త్రివిక్రమ్ వర్సెస్ ‘హనుమాన్ అంశ్’ ఫైట్ ఎలా ఉండబోతోందనేది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

వారి ఆశయాలు సదా స్ఫూర్తిదాయకం: చిరంజీవి

ఫేవరెట్ హీరోతోనే పోటీకి శ్రీవిష్ణు.. ఆ వేవ్‌ను తట్టుకోగలడా?

‘కుకూన్స్’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశారంటే

Updated Date - Oct 02 , 2026 | 01:08 PM