వారి ఆశయాలు సదా స్ఫూర్తిదాయకం: చిరంజీవి

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:12 PM

జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వారికి ఘనంగా నివాళులర్పించారు.

Chiranjeevi

భారత స్వాతంత్య్రోద్యమానికి, దేశ ప్రగతికి మహోన్నత సేవలు అందించిన ఇద్దరు మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా వారి గొప్పతనాన్ని, దేశానికి వారు చేసిన సేవలను కొనియాడుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.


‘‘భారతదేశానికి మహోన్నత సేవలు అందించిన ఇద్దరు మహనీయులు.. సత్యాన్ని ఆయుధంగా, అహింసను మార్గంగా ఎంచుకుని, ప్రపంచానికి సరికొత్త పోరాట స్ఫూర్తిని అందించిన జాతిపిత మహాత్మా గాంధీజీ (Gandhi Jayanti). జీవితాంతం నిరాడంబరతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో దేశాన్ని ఏకతాటిపై నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు (Lal Bahadur Shastri Jayanti). వారి ఆశయాలు మనందరికీ సదా స్ఫూర్తిదాయకం. ఈ ఇద్దరు మహనీయుల జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి ఘన నివాళులు’’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు.


సెలబ్రిటీల నివాళులు

మెగాస్టార్‌‌తో పాటు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీజీ చూపిన శాంతి మార్గం, సరిహద్దుల్లో జవాన్లకు, దేశానికి అన్నంపెట్టే రైతన్నలకు సమాన గౌరవాన్ని కల్పిస్తూ శాస్త్రి గారు ఇచ్చిన నినాదం నేటికీ చిరస్మరణీయమని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సందేశాల్లో గుర్తుచేసుకున్నారు. వారి అడుగుజాడల్లో నడవడమే ఆ మహనీయులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

ఫేవరెట్ హీరోతోనే పోటీకి శ్రీవిష్ణు.. ఆ వేవ్‌ను తట్టుకోగలడా?

‘కుకూన్స్’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశారంటే

ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ వైఫ్.. ఈ వివాదానికి అంతమెప్పుడు?

Updated Date - Oct 02 , 2026 | 12:12 PM