ఈసారి త్రీడీలో హను-మాన్!
ABN, Publish Date - May 16 , 2026 | 04:33 PM
తేజ సజ్జా హీరోగా నటించిన 'హను-మాన్' 2024లో సంక్రాంతి కానుకగా విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఇప్పుడు త్రీడీ వర్షన్‌లో జనం ముందుకు రాబోతోంది.
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించిన 'హను-మాన్' (Hanu-man) మూవీ 2024 జనవరి 12న విడుదలైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా దీనిని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి విడుదల చేశారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందడమే కాదు... రెండు నేషనల్ అవార్డ్స్ నూ సొంతం చేసుకుంది. బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు, బెస్ట్ స్ట్రంట్ కొరియోగ్రఫీ అవార్డు ఈ సినిమాకు దక్కాయి.
విశేషం ఏమంటే... 'హను-మాన్' మూవీతో దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ను స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో 'జై హనుమాన్' (Jai Hanuman) చిత్రాన్ని రిషబ్‌శెట్టితో తెరకెక్కిస్తున్నాడు. అయితే భారతీయ సినిమా రంగంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన 'హను-మాన్' చిత్రం ఇప్పుడు త్రీడీలో జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాను జూన్ 25న త్రీడీలో వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
'హను-మాన్' మూవీ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన మరో పాన్ ఇండియా మూవీ 'మిరాయ్' సైతం మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ 2డీలో ప్రేక్షకులను మెప్పించిన 'హను-మాన్' త్రీడీ వర్షన్ వస్తుండటం విశేషమే. ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాను త్రీడీలో చూస్తే మరింత ఎంజాయ్ చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!
Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?
లవ్ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
మోదీ ‘పొదుపు మంత్రం’.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!